రాజమౌళి చేతిలో పడితే అజయ్ దేవగన్ ఇలాగే ఉంటాడు మరి

Ajay Devgan in RRR

Ajay Devgan in RRR

రాజమౌళి సినిమాలో పనిచేస్తే అప్పటివరకు లేని గుర్తింపు వస్తుంది. అందుకే స్థార్ నటీనటులంతా ఆయన దర్శకత్వంలో ఒక్కసారైనా కనబడాలని అనుకుంటుంటారు. ఆమిర్ ఖాన్ లాంటి హీరోనే రాజమౌళి సినిమా చేసే ఛాన్స్ ఇస్తే తప్పకుండా చేస్తానని అన్నారంటే జక్కన్న ప్రెజెంటేషన్ ఎలా ఉంటుందో చూడండి. ఆయన కథలోని ప్రతి పాత్రకు ఇక ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి పాత్రను కథానాయకుడి పాత్రకు ఇచ్చిన ప్రాముఖ్యత ఇచ్చి తీర్చిదిద్దుతుంటారు ఆయన. అందుకే ఆయన సినిమాల్లో పాత్రలు, అందులో నటించిన నటీనటులు ప్రేక్షకులకు ఇట్టే గుర్తుండిపోతారు.

Ajay Devgn Motion Poster - RRR Movie | NTR, Ram Charan, Alia Bhatt | SS Rajamouli

సత్యరాజ్ చేత కట్టప్ప పాత్ర చేయించి దేశం మొత్తం ఆ పేరును మంత్రంలా జపించేలా చేసిన రాజమౌళి ఇప్పుడు అజయ్ దేవగన్ ను అలాంటి ఎలివేషన్ ఇస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’లో అజయ్ దేవగన్ ఒక కీ రోల్ చేస్తున్నారు. చాలామంది దర్శకులు ఎంతటి ముఖ్య పాత్ర అయినా హీరో పాత్ర కంటే కొంచెం తక్కువే ఉండేలా డిజైన్ చేస్తుంటారు. కానీ రాజమౌళి అలా కాదు. అవసరమైతే హీరోల పాత్రల కంటే సహాయ పాత్రలకు ఎక్కువ ఎలివేషన్స్ ఇస్తుంటారు. ఈరోజు అజయ్ దేవగన్ పుట్టినరోజు కావడంతో ‘ఆర్ఆర్ఆర్’ నుండి ఆయన లుక్ వదిలారు. అందులో అజయ్ దేవగన్ ను రామరాజు, భీమ్ పాత్రల లెవల్లో చూపించారు. ఈయన కూడ సినిమాలో ఒక హీరోనా అనేలా ఉంది మోషన్ పోస్టర్. మరి రాజమౌళి చేతిలో పడితే ఎవరైనా అంతే మరి.