మహేష్ కోసం ఫస్ట్ టైమ్ రాజమౌళి.. అది కూడ ఆఫ్రికాలో

SS Rajamouli to shoot Mahesh film in Africa

SS Rajamouli to shoot Mahesh film in Africa

సూపర్ స్టార్ మహేష్ బాబు జాబితాలో ఉన్న దర్శకుల్లో ఎస్.ఎస్.రాజమౌళి పేరు కూడ ఉంది. ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ చేస్తున్న ఆయన అది పూర్తికాగానే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. అది పూర్తయ్యేనాటికి ఇంకో ఏడాది పడుతుంది. ఈలోపు రాజమౌళి కూడ ‘ఆర్ఆర్ఆర్’ పూర్తిచేసి కాస్త రిలాక్స్ అవుతారు. అలా ఇద్దరూ పూర్తిగా ఖాళీ అవ్వగానే వీరి సినిమా మొదలవుతుందని తెలుస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రాజమౌళి చేసే సినిమా అందునా మహేష్ బాబుతో మొదటిసారి చేస్తున్న సినిమా. కాబట్టి అంచనాలు భారీగా ఉన్నాయి. సినిమాను ఏ స్థాయిలో ఊహించాలో కూడ ప్రేక్షకులకు అర్థం కావట్లేదు.

ఫిలిం నగర్ టాక్ మేరకు అయితే జక్కన్న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అది కూడ ఇక్కడ కాదట.. ఆఫ్రికాలోనట. అడవుల నేపథ్యంలో సాగే సినిమా కావడంతో ఎక్కువ భాగం అడవుల్లోనే చేయాల్సి ఉంటుందట. అందుకే రాజమౌళి ఆఫ్రికా అడవులను చూజ్ చేసుకున్నారట. అయితే షూటింగ్ వరకే ఆఫ్రికా అడవుల్లో చేస్తారా లేకపోతే కథ కూడ ఆఫ్రికాకు లింక్ అయి ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు రాజమౌళి ఎంత పెద్ద సినిమా అయినా చిత్రీకరణ కోసం విదేశాలకు వెళ్లిన దాఖలాలు లేవు. కానీ మొదటిసారి మహేష్ బాబు కోసం వెళ్లేలా ఉన్నారు.