Home News భారీ సన్నాహాలు చేస్తున్న రాజమౌళి

భారీ సన్నాహాలు చేస్తున్న రాజమౌళి

Ss Rajamouli Planning Huge Promotions In Upcoming Months
సినిమా ఎంత పెద్దదైనా ప్రమోషన్లు తప్పనిసరి.  ఎంత ప్రచారం ఉంటే అంతగా జనంలోకి వెళ్తుంది సినిమా.  ఈ ప్రచార పర్వానికి ఏ సినిమా కూడ మినహాయింపు కాదు.  దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సైతం తన సినిమాలకు ఇదే ఫార్ములాని ఫాలో అవుతుంటారు.  అందుకే ఆయన సినిమా గురించిన ఏ చిన్న అప్డేట్ అయినా సామాజిక మాధ్యమాల్లో సెన్సేషన్ సృష్టిస్తుంది. ప్రజెంట్ ఆయన చేస్తున్న ఆర్ఆర్ఆర్ మీద ఎనలేని హైప్ ఉంది. విడుదల వరకు ఆ హైప్ అలాగే మైంటైన్ చేయాలని చూస్తున్నారు రాజమౌళి.  ఒక్క తెలుగులోనే కాదు అన్ని భాషల్లోనూ చిత్రానికి సూపర్ పబ్లిసిటీ దక్కేలా ప్లాన్ చేస్తున్నారు. 
 
ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్, ఆలియా భట్, అజయ్ దేవగన్ లాంటి ముఖ్య తారాగణం చేస్తున్న పాత్రలకి సంబంధించి టీజర్లు విడుదలచేసిన ఆర్ఆర్ఆర్ బృందం కొత్త ప్రచార పర్వానికి తెరలేపుతోంది.  ఆర్ఆర్ఆర్ మేకింగ్ పేరుతో ఒక వీడియోను రూపొందిస్తున్నారట.  దీన్ని ఎప్పుడు విడుదల చేసేది ఈరోజు రివీల్ చేస్తారట.  ఇదొక్కటే కాదు ఇకపై సినిమా రిలీజ్ వరకు వరుసగా హడావుడి చేస్తూనే ఉంటారట.  అందుకుగాను కావల్సిన స్టఫ్ మొత్తాన్ని సిద్ధం చేస్తున్నారట.  ట్రైలర్స్, పోస్టర్స్, ముఖ్య తారాగణం ఇంటర్వ్యూలు, పాటల రిలీజ్, ఆడియో వేడుక, ప్రీరిలీజ్ ఈవెంట్, ఇతర భాషల్లో ప్రమోషన్లు ఇలా చాలా పెద్ద ప్రమోషనల్ షెడ్యూల్ వేసుకున్నారట.  మొత్తానికి రాజమౌళి రానున్న రోజుల్లో ‘ఆర్ఆర్ఆర్’తో గట్టిగానే హడావుడి చేస్తారన్నమాట.  

Related Posts

‘మా’ రాజకీయం: తెలుగు నటుల ఆత్మగౌరవం కోసం.?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అంటే, అది తెలుగు సినీ నటీనటుల ఆత్మగౌరవం కోసమా.? ఇప్పుడీ చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది. 'మా' ఆత్మగౌరవం.. అంటూ మంచు విష్ణు ఇచ్చిన స్లోగన్ చుట్టూ చిత్ర...

పోసానిది ఆవేదన కాదు.. జుగుప్సాకరమైన ప్రవర్తన.!

'నేను వైఎస్సార్సీపీ కార్యకర్తని.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిమానిని..' అంటూ పోసాని కృష్ణమురళి చెప్పుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద అత్యంత జుగుప్సాకరమైన ఆరోపణలు చేస్తున్నారాయన. పవన్ కళ్యాణ్ అభిమానులు...

‘పెళ్లి సందడి’ భామకి అప్పుడే అంత క్రేజ్.?

'పెళ్లిసందడి' సినిమా అప్పట్లో ఓ పెద్ద సంచలనం. దర్శక రత్న రాఘవేంద్రరావు రూపొందించిన ఈ అద్భుత ప్రేమ కావ్యంలో శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ నటించిన సంగతి తెలిసిందే. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ...

Related Posts

Latest News