SS Rajamouli: ఏంటి.. ఆ స్టార్ డైరెక్టర్ వాట్సాప్ ఉపయోగించరా.. ప్రశంసలు కురిపించిన రాజమౌళి!

SS Rajamouli: టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు అన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ కుబేర. ఇందులో ధనుష్ హీరోగా నటించగా, రష్మిక మందన హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా జూన్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా హైదరాబాదులో మూవీ మేకర్స్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌ శేఖర కమ్ములపై ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ రాజమౌళి మాట్లాడుతూ.. తాను నమ్మే సిద్ధాంతాలకు.. చేసే సినిమాలకు ఎలాంటి సంబంధం ఉండదు. కానీ శేఖర్ కమ్ముల తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తారు. శేఖర్ చాలా సాప్ట్‌ గా ఉంటారు. తన సిద్ధాంతాలకు ఏది అడ్డు వచ్చినా కొంచెం కూడా ఆయన కాంప్రమైజ్ అవ్వరు.

తాను నమ్మినా సిద్ధాంతాలపైనే సినిమాలు తీస్తారు. అందుకే ఆయనంటే ఎంతో గౌరవం. మీరు వాట్సాప్ వాడుతారా అని శేఖర్‌ కమ్ములను రాజమౌళి అడగ్గా.. తాను ఉపయోగించనని ఆయన సమాదానం ఇచ్చారు. దాంతో శేఖర్ కమ్ముల మాటలకు అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడున్న జనరేషన్లో వాట్సాప్ వినియోగించకుండా ఉండడం అన్నది నిజంగా చాలా గ్రేట్ అంటూ కొనిఆడుతున్నారు. కుబేర సినిమా విషయానికి వస్తే.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ టీజర్ పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. మరో మూడు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది..