అంతలా వెంటపడుతున్నా పుష్పరాజ్‌ని పట్టించుకోవా శ్రీవల్లీ.!

‘నీ చూపే బంగారమాయెనే శ్రీ వల్లీ.. నీ మాటే మాణిక్యమాయెనే శ్రీ వల్లీ..’ అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో తెగ పొగిడించేసుకుంటోంది అందాల భామ రష్మికా మండన్నా. ఈ ఇద్దరూ జంటగా తెరకెక్కుతోన్నచిత్రం ‘పుష్ప’. డిశంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే కొన్ని ప్రోమోలతో పాటు, ఓ లిరికల్ సాంగ్ కూడా రిలీజ్ చేశారు. అవన్నీ మంచి రెస్పాన్స్ అందుకోగా, దసరా సందర్భంగా రిలీజైన మరో లిరికల్ సాంగ్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

శ్రీ వల్లి ప్రేమలో పడిన పుష్పరాజ్, ఆమె ప్రేమను పొందడానికి ఆమె వెంట పడుతూ పాడే ఈ పాట ఆడియన్స్‌ని విశేషంగా ఆకట్టుకుంటోంది. గళ్ల చొక్కా, నల్ల కళ్లజోడుతో మన లారీ డ్రైవర్ పుష్పరాజ్, లంగా వోణీలు, రెండు జడలతో పల్లెటూరి అమ్మాయిగా క్యూట్ క్యూట్ లుక్స్‌తో మన శ్రీ వల్లి భలే ముచ్చటేసుకొస్తున్నారీ పాటలో.

చిన్న చిన్న స్టిల్స్‌తో ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీ పెంచేశారు. ఇంత చిన్న సాంగ్ బిట్టే ఇలా ఉంటే, ఫుల్ సాంగ్ ఇంకెంత బాగా డిజైన్ చేశారో అనే క్యూరియాసిటీ అందరిలోనూ నెలకొంది. రాకింగ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటను మ్యూజిక్ మ్యాజిక్ సిద్ శ్రీరామ్ ఆలపించారు.