శ్రీనువైట్ల తగ్గట్లేదు.. పెద్ద హీరోలకే వల వేస్తున్నాడు

Srinu Vaitla trying to cast stars in his next movies
Srinu Vaitla trying to cast stars in his next movies
ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ ఇచ్చి కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ అనిపించుకున్న శ్రీనువైట్ల గత కొన్నేళ్ళుగా ఫ్లాపులతో సతమతమవుతున్నారు. సాధారణంగా అయితే ఇన్ని ఫ్లాపులు పడ్డ ఏ దర్శకుడైనా స్టార్ హీరోలను అప్రోచ్ అవడానికి వెనకడతాడు. ముందు చిన్న మీదా మీడియమ్ రేంజ్ హీరోతో ఒక సక్సెస్ కొట్టి హిట్ ట్రాక్ ఎక్కాక స్టార్ హీరోల దగ్గరికి వెళ్లాలని అనుకుంటారు.  కానీ శ్రీనువైట్ల మాత్రం పెద్ద హీరోలతోనే వర్క్ చేస్తా అంటున్నారు.  ప్రస్తుతం ఆయన మంచు విష్ణు హీరోగా ‘ఢీ అండ్ ఢీ’ తెరకెక్కించే పనిలో ఉన్నారు.  తన సూపర్ హిట్ ఫైల్ ‘ఢీ’కు ఇది సీక్వెల్.  మీడియమ్ రేంజ్ హీరోలు కూడ దొరకని పరిస్థితుల్లో ఫ్లాపుల్లో ఉన్న విష్ణును ఈజీగా పట్టుకోగలిగారు ఆయన.  
 
అయితే తర్వాత చేయబోయే సినిమాల్లో మాత్రం పెద్ద హీరోలే ఉండాలని డిసైడ్ అయ్యారట ఆయన.  ‘ఢీ ఆ ఢీ’ తర్వాత రెండు చిత్రాలను ప్లాన్ చేసున్నారు ఆయన.  కథలను కూడ సిద్ధం చేసుకున్నారు.  వాటిలో ఒకటి ‘డబుల్స్’. ఇందులో ఇద్దరు స్టార్ హీరోలను తీసుకోవాలనేది ఆయన ఆలోచనట.  ఆమేరకు పెద్ద హీరోలను అప్రోచ్ అయ్యే ప్రయత్నాలు కూడ చేస్తున్నారట.  ఈ చిత్రానికి ‘ఢీ అండ్ ఢీ’కు మధ్యలో ఒక సినిమా అనుకుంటున్నారు. అందులో కూడ స్టార్ హీరోనే తీసుకురావాలని చూస్తున్నారట.  ఫ్లాప్ డైరెక్టర్ అనే మార్క్ ఉన్నప్పటికీ శ్రీనువైట్ల మాత్రం స్టార్లను వదిలే ఆలోచనలో మాత్రం లేరు.  మరి ఒకప్పుడు ఆయన దర్శకత్వంలో హిట్లు అందుకున్న, ఇన్నాళ్లు ఆయన్ను పక్కనపెట్టిన పెద్ద హీరోలు ఈసారైనా అవకాశం ఇస్తారేమో చూడాలి.