Hero Sreekanth: శంకర్- చరణ్ సినిమాలో అలాంటి పాత్రలో సందడి చేయనున్న శ్రీకాంత్!

Hero Sreekanth: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా ఎన్నో కుటుంబ కథా చిత్రాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అయితే తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మరో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ఇలా ఈ ఇంటర్వ్యూలో శ్రీకాంత్ మాట్లాడుతూ తాను ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో హీరోగా కాకుండా విలన్ గా తన ప్రస్థానం మొదలు పెట్టానని తెలిపారు.ఇలా విలన్ గా పలు చిత్రాల్లో నటించిన మంచి గుర్తింపురాలేదు. ఈ క్రమంలోనే హీరోగా అవకాశం రావడంతో హీరోగా నటించానని శ్రీకాంత్ ఇంటర్వ్యూ సందర్భంగా తెలిపారు.

ఇలా విలన్ గా తన కెరియర్ ప్రారంభించిన శ్రీకాంత్ బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన అఖండ సినిమా ద్వారా మరోసారి వరదరాజులు అనే విలన్ పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చానని తెలిపారు.డైరెక్టర్ బోయపాటి శీను గారు నాకు ఈ సినిమా కథ చెప్పినప్పుడు కచ్చితంగా నా పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం తనలో కలిగి ఉందని తెలిపారు.బోయపాటి కాంబినేషన్ లో అల్లు అర్జున్ హీరోగా సరైనోడు సినిమా షూటింగ్ సమయంలో బోయపాటి గారు తనకు ఒక మంచి విలన్ పాత్ర సిద్ధం చేస్తున్నానని చెప్పినట్లు ఈ సందర్భంగా తెలిపారు.

అయితే రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న అత్యంత భారీ బడ్జెట్ చిత్రంలో తాను మరొక పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయాన్ని తెలిపారు.ఈ సినిమాలో తన పాత్ర చూస్తే ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తారని, ఇందులో నటించింది శ్రీకాంతేనా.. అనే సందేహం ప్రతి ఒక్కరికి కలుగుతుందని ఈ సందర్భంగా శ్రీకాంత్ చరణ్ శంకర్ సినిమాలో తన పాత్ర గురించి తెలియజేశారు. ఇక ఈ పాత్ర ద్వారా శ్రీకాంత్ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటారో వేచి చూడాలి.