Game Changer: గేమ్ చేంజర్ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన శ్రీకాంత్.. ఆ పాత్రలో ఇరగదీసాడంటూ!

Game Changer: టాలీవుడ్ హీరో రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలవల్ల వాయిదా పడుతూ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఎట్టకేలకు ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేయబోతున్నారు మూవీ మేకర్స్. కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంజనాలు నెలకొన్నాయి. విడుదల సమయం దగ్గర పడుతుండడంతో మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను మొదలు పెట్టే పనిలో ఉన్నారు. కాగా ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌ పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌ గా నిర్మించిన విషయం తెలిసిందే.

ఇకపోతే ఈ సినిమాలో హీరో నటుడు శ్రీకాంత్ ఒక ముఖ్య పాత్రలో నటించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు శ్రీకాంత్. అందులో భాగంగానే గేమ్ చేంజర్ కు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని కూడా ఇచ్చారు. గేమ్ చేంజర్ సినిమాలో మీ పాత్ర ఎలా ఉండబోతోంది అన్న ప్రశ్నకు శ్రీకాంత్ సమాధానం ఇస్తూ.. శంకర్ గారితో పని చేయాలని ప్రతీ ఒక్క ఆర్టిస్ట్‌ కు ఉంటుంది. గేమ్ చేంజర్ కథ ఆయన ఫస్ట్ హాఫ్ చెప్పినప్పుడు ఈ పాత్రను నాకు ఎందుకు చెబుతున్నారా? అని అనుకున్నాను. సెకండాఫ్ చెప్పిన తరువాత ఈ పాత్రను కచ్చితంగా నేనే చేయాలని అనుకున్నాను. నా కారెక్టర్ అంత బాగా ఉంటుంది. గెటప్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. ఈ ప్రోస్థటిక్ మేకప్‌కే నాలుగు గంటలు పట్టేది. నేను ఇంత వరకు ప్రోస్థటిక్ మేకప్‌ వేసుకుని నటించలేదు. కానీ అలాంటి మేకప్ ధరించి నటించడం చాలా కష్టం. చెమటలు పట్టినా మేకప్ మారిపోతుంది అని అన్నారు.

అలాగే శంకర్ గారి పనితనం గురించి నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆయన చాలా సహనంతో ఉంటారు. అనుకున్నది అనుకున్నట్టు వచ్చే వరకు టేక్స్ తీసుకుంటూనే ఉంటారు. ప్రతీ కారెక్టర్‌ ను ఆయన నటించి చూపిస్తారు. గేమ్ ఛేంజర్‌ లో నా పాత్రలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. చాలా సస్పెన్స్‌ లు ఉంటాయి. అవన్నీ చెప్పొద్దని అన్నారు. గెటప్ వేసిన వెంటనే ఆ కారెక్టర్ తాలుకా షేడ్స్ అన్నీ వచ్చేస్తాయి. నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. సినిమాకు చాలా ముఖ్యమైన కారెక్టర్. ఇంత మంచి అవకాశం రావడం అదృష్టం. గోవిందుడు అందరివాడేలే చిత్రం టైంలో రామ్ చరణ్ చాలా యంగ్. ఇప్పుడు చాలా ఎదిగాడు. గ్లోబల్ స్థాయికి ఎదిగాడు. అప్పన్న పాత్రను రామ్ చరణ్ పోషించిన తీరు చూస్తే అంతా షాక్ అవుతారు. చాలా కొత్తగా అనిపిస్తాడు అంటూ రామ్ చరణ్ నటించిన బోయే పాత్ర గురించి ఆ పాత్ర పేరు గురించి తెలిపారు శ్రీకాంత్. ఈ సందర్భంగా శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి విడుదల సమయం దగ్గర పడుతోంది, మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఇస్తారేమో చూడాలి మరి.