Peddi: టాలీవుడ్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే రామ్ చరణ్ చివరగా గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ఊహించిన విధంగా డిజాస్టర్ గా నిలిచింది. దీంతో అభిమానుల్లో ఆశలన్నీ కూడా తదుపరి సినిమా పైన పెట్టుకున్నారు.
కాగా రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోంది. రామ్ చరణ్ శ్రీకాకుళం యాసలో మాట్లాడుతూ.. క్రికెట్ ప్లేయర్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయినా గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేసింది. అయితే ఈ సినిమాలో శ్రీకాకుళం జానపద గీతం మా ఊరు ప్రెసిడెంట్.. పాట స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుందట.
దీన్ని ప్రముఖ సింగర్ పెంచల్ దాస్ పాడినట్లు తెలుస్తోంది. ఈ పాట సినిమాకి హైలైట్ గా నిలువనుందట. పెద్ది సినిమాలో ఈ స్పెషల్ సాంగ్ ని జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారట. ఇందులో వందమంది డాన్సర్లతో పాటు చాలా మంది జూనియర్ ఆర్టిస్టులు పార్టిసిపేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ లో మంచి క్రేజ్ ని ఊపుని సృష్టించేందుకు బుచ్చిబాబు భారీగా ప్లాన్ చేస్తున్నారని టాక్. ఈ పాటలో ఒక స్టార్ హీరోయిన్ స్టెప్పులేసే అవకాశం ఉందట. అయితే ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.
Peddi: చరణ్ పెద్ది మూవీలో స్పెషల్ శ్రీకాకుళం సాంగ్.. బుచ్చిబాబు ప్లాన్ మాములుగా లేదుగా?
