Sreeleela: పెళ్లి కూతురు గెటప్ లో శ్రీ లీల.. అసలు విషయం చెప్పేసిన హీరోయిన్!

Sreeleela: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదట పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తన డ్యాన్స్ తో అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమా అవకాశాలు అందుకొని హీరోయిన్ గా బాగా పాపులర్ అయింది. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ శ్రీలేళ్లకు పాపులారిటీ మాత్రం మామూలుగా లేదు. ఇకపోతే ప్రస్తుతం శ్రీలీల ఒకవైపు సినిమాలలో నటిస్తూనే నడకవైపు చదువును కొనసాగిస్తోంది.

ఇది ఇలా ఉంటే కెరియర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది శ్రీలీల. అందులో భాగంగానే తాజాగా కొన్ని ఫోటోలు షేర్ చేసిన విషయం తెలిసిందే. అందులో పెళ్లికూతురు గెటప్ లో పసుపు రాసుకుంటూ చాలా సంతోషంగా కనిపించింది.. తన చుట్టూ ఉన్న వాతావరణం కూడా పెళ్లి వాతావరణాన్ని తలపిస్తోంది.. ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి నిశ్చితార్థం ఫోటోలు అంటూ కొంతమంది కామెంట్ చేశారు.. అదేంటి శ్రీలీలకు పెళ్లి ఫిక్స్ అయ్యిందా సడన్గా ఇలాంటి ఫొటోస్ షేర్ చేసింది ఏంటి అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.

అయితే తాజాగా ఈ వార్తలపై ఆ ఫోటోల గురించి స్పందించింది శ్రీలీల. ఈ సందర్భంగా ఆ ఫొటోస్ పై ఆమె స్పందిస్తూ.. నా ప్రీ బర్త్‌డే వేడుకలను ఇంట్లోనే మేము ఈ విధంగా సెలబ్రేట్‌ చేసుకున్నాము. దీనికి సంబంధించిన ప్లానింగ్‌ అంతా మా అమ్మ చూసుకున్నారు అని ఆమె రాసుకొచ్చారు. ఈ వేడుకల్లో రానా సతీమణి మిహిక కూడా పాల్గొన్నారు. ఇందులో శ్రీలీల చీరకట్టులో కనిపించారు. అసలు విషయం తెలియడంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. జూన్ నాలుగవ తేదీన శ్రీలీల తన 24వ పుట్టినరోజును జరుపుకోనుంది.