Sreeleela: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతోంది ఈ బ్యూటీ.. మొన్నటి వరకు తెలుగులో వరుసగా సినిమాలు చేసిన ఈమె ఇప్పుడు కాస్త స్లో అయిందని చెప్పాలి. ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తోంది శ్రీ లీల. ఒకవైపు సినిమాలలలో నటిస్తూనే మరోవైపు చదువును కూడా కొనసాగిస్తోంది.
కాగా సరైన హిట్ పడకపోయినప్పటికీ ఈ ముద్దుగుమ్మ సినిమాలు సక్సెస్ కాక పోయినప్పటికీ ట్రెండింగ్ హీరోయిన్ కావడంతో ఈమెకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా శ్రీ లీల హీరోయిన్ గా నటించిన జూనియర్ సినిమా విడుదల అయిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో హీరోయిన్ శ్రీ లీల పేరు గట్టిగా వినిపిస్తోంది. ఆ సంగతి పక్కన పెడితే.. హిందీలో ఇప్పుడు ఈ అమ్మడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తోంది.
తాజాగా ఈ అమ్మడుకి బాలీవుడ్ లో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హిందీలో కార్తిక్ ఆర్యన్ సరసన ఒక లవ్ స్టోరీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదివరకే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో మరో ఆఫర్ కొట్టేసినట్లుగా తెలుస్తోంది. అతడు మరెవరో కాదు.. రణవీర్ సింగ్. కాగా రణవీర్ హీరోగా వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటించనున్నట్లు టాక్. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు జరిపారని త్వరలోనే దీనిపై అఫిషియల్ అనౌన్స్మెంట్ రానుందని టాక్.
Sreeleela: ఫుల్ జోష్ లో ఉన్న శ్రీ లీల.. బాలీవుడ్ లో ఆ స్టార్ హీరోతో చేసే ఛాన్స్!
