Sreeleela: నటి శ్రీ లీలకు స్పెషల్ గిఫ్ట్ పంపిన ముఖ్యమంత్రి…. అంత స్పెషల్ ఏంటబ్బా?

Sreeleela: శ్రీ లీల పరిచయం అవసరం లేని పేరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ ముద్దుగుమ్మకు వరుసగా నిరాశ ఎదురవుతుంది. దాదాపు డజనకు పైగా సినిమాలలో నటించిన శ్రీ లీలకు రెండు మూడు హిట్లు తప్ప పెద్దగా సక్సెస్ మాత్రం రాలేదని చెప్పాలి ఇలా ఈమె సినిమాలు సక్సెస్ కాకపోయినా అవకాశాలు మాత్రం క్యూ కడుతున్నాయి.

తాజాగా శ్రీ లీల నితిన్ హీరోగా నటించిన రాబిన్ హుడ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా ద్వారా ఈమెకు మరోసారి నిరాశ ఎదురైందని చెప్పాలి. ఇలా ఒకవైపు తెలుగు సినిమాలలో నటిస్తూనే మరోవైపు బాలీవుడ్ సినిమా అవకాశాలను అందుకుంటు కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

ప్రస్తుతం ఈమె బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ తో కలిసి ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం సిక్కింలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ చిత్రీకరణలో భాగంగా కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీ కరిస్తున్నారు. ఈ షెడ్యూల్ లో హీరో, హీరోయిన్లు కార్తీక్ ఆర్యన్, శ్రీలీల కూడా పాల్గొంటున్నారు. తాజాగా యూనిట్ అంతా కలిసి సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ క్రమంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ సైతం చిత్ర బృందానికి కానుకలను అందజేశారు.తమ రాష్ట్ర సంప్రదాయం ప్రతిబింబించేలా కొన్ని బహుమతులు అందజేశారు. మూవీ షూటింగ్ పూర్తయ్యే వరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తిస్తాయిలో సహకారం అందిస్తామని చిత్ర బృందానికి హామీ ఇచ్చారు. ఇక ఈ విషయాన్ని రాష్ట్ర సీఎం ఓ అధికారికంగా తెలియజేశారు.