Janhvi Kapoor: సౌత్ ఎంట్రీ ఇవన్నున్న అందాల తనయ జాన్వీ కపూర్..ఏ సినిమాలోని తెలుసా?

Janhvi Kapoor: అతిలోక సుందరి శ్రీదేవి బోనికపూర్ ల గారాలపట్టి జాన్వీ కపూర్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఈమె తన తల్లి వారసత్వాన్ని అందిపుచ్చుకుని ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ సౌత్ ఎంట్రీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తమిళంలో స్టార్ హీరో అజిత్ హీరోగా నటించిన వాలిమై చిత్రంలో జాన్వీ కపూర్ నటించారని ఈ సినిమా ద్వారా ఈమె కోలివుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. అజిత్ హీరోగా నటించిన ఈ సినిమాకి హెచ్.వినోద్ దర్శకత్వం వహించగా, బోనీ కపూర్ నిర్మాతగా వ్యవహరించారు.

ఈ క్రమంలోనే వాలీమై సినిమా ద్వారా జాన్వికపూర్ సౌత్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నట్టు పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే ఈ సినిమాలో జాన్వీకపూర్ పాత్రకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్నట్లు కోలివుడ్ సమాచారం. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరి 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే యుఎస్ఏ‌లో సినిమాకు సంబంధించిన టిక్కెట్ బుక్కింగ్స్ మొదలయ్యాయి. ఇదిలా ఉండగా ఆ వెబ్‌సైట్‌లు ‘‘ వలీమై’’ నటీనటుల జాబితాలో జాన్వీ కపూర్‌ను చూపిస్తుండటంతో ఈ విషయం బయటపడింది.

మరి దీని ప్రకారం ఈ సినిమా ద్వారా జాన్వికపూర్ సర్ప్రైస్ ఇస్తూ సౌత్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తారా లేకపోతే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.జాన్వి కపూర్ తండ్రి బోనీ కపూర్ ఈ సినిమా నిర్మించడంతో ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశాలు కూడా ఉన్నాయని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జాన్వీ కపూర్ అజిత్ హీరోగా తెరకెక్కి  ‘‘ నెర్కొండ పావై’’ తోనే ఆమె కోలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఈ సినిమాలో నటించడం కుదరలేదు. అయితే ఈ సినిమాని కూడా బోని కపూర్ నిర్మించడం విశేషం. ఇక
వలీమై లో అజిత్, కార్తికేయ, హ్యుమా ఖురేషి,  యామీ గౌతమ్, సుమిత్ర వంటి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.