డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జనగణమణ’. దీన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయాలనేది పూరి కోరిక. మహేష్ డేట్స్ కోసం ఆయన చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్నారు. కానీ బిజీ షెడ్యూల్స్ మూలంగా మహేష్ బాబు పూరితో సినిమా చేయలేకపోతున్నారు. దీంతో పూరి ఇప్పటికే చాలా ఆలస్యమైందని భావించి ఆ కథను వేరొకరితో చేయాలని డిసైడ్ అయ్యారట. ఆ నటుడు మరెవరో కాదు సోనూ సూద్. పాన్ ఇండియా అప్పీల్ ఉండటంతో ఇన్నాళ్లు మహేష్ బాబుకు రీప్లేస్మెంట్ దొరకలేదు పూరికి.
కానీ సోనూ సూద్ రేంజ్ ఇప్పుడు మారింది. లాక్ డౌన్ సమయంలో ఆయన చేసిన సేవలకుగాను ఆయనకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. అందరూ సోనూను రియల్ హీరో అంటున్నారు. ఇలాంటి టైంలో సోనూతో ‘జనగణమణ’ స్టోరీ చేస్తే సరిగ్గా సెట్టవుతుందని పూరి భావిస్తున్నారట. పైగా సోనూకు పూరికి మంచి రిలేషన్ ఉంది. తన సినిమాల్లో సోనూకు మంచి మంచి పాత్రలు ఇచ్చారు పూరి. పైగా కథ మంచి కథ. అందుకే సోనూ సైతం ‘జనగణమణ’ మీద ఆసక్తిగా ఉన్నారట. ప్రజెంట్ పూరి ‘లైగర్’ చేస్తున్నారు. దాని తర్వాత ఒక కమిట్మెంట్ ఉంది ఆయనకు. అది కంప్లీట్ అయ్యాక ‘జనగణమణ’ పట్టాలెక్కవచ్చని అంటున్నారు.