కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ ఆరోగ్యం బాగాలేదనే విషయం అందరికీ తెలుసు. తనకు క్యాన్సర్ వచ్చిందని.. తర్వాత ట్రీట్ మెంట్ కూడా చేయించకున్నారని.. క్యాన్సర్ నయం అయ్యాక ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకిందంటూ వార్తలు వచ్చాయి. దీంతో ప్రస్తుతం ఆమె ఊపిరితిత్తులకు సంబంధించిన ట్రీట్ మెంట్ చేయించుకుంటున్నారు.
అయితే.. చాలా ఏళ్లుగా సోనియా గాంధీ ఢిల్లీలోనే ఉంటున్నారు. ఆమె తనయుడు రాహుల్ కూడా అక్కడే ఉంటారు. ఏదైనా జాతీయ పార్టీకి చెందిన హైకమాండ్ ఎక్కువగా ఢిల్లీలోనే మకాం వేస్తారు. అక్కడే పార్లమెంట్ ఉండటం.. సుప్రీంకోర్టు ఉండటం.. ఢిల్లీ దేశానికే రాజధాని కావడంతో.. చాలామంది నాయకులు అక్కడే ఎక్కువగా ఉండటానికి ఇష్టపడతారు.
కానీ.. ఢిల్లీలో పరిస్థితులు ఇప్పుడు వేరేలా ఉన్నాయి. ఢిల్లీలో రోజురోజుకూ పెరిగిపోతున్న వాయుకాలుష్యంతో పాటు.. కరోనా కేసులు కూడా ఎక్కువవుతున్నాయి.
కరోనా ఉన్నవాళ్లకు, వాయు కాలుష్యం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు అధికం అవుతాయి. దాని వల్ల ఒక్కోసారి ప్రాణానికే ప్రమాదం ఏర్పడొచ్చు. అందుకే.. ఢిల్లీలో ఉండి రిస్క్ చేయడం కంటే వేరు చోటుకు మారడం బెటర్ అని సోనియా గాంధీ ఇటీవలే తన మకాన్ని గోవాకు మార్చారు.
అయితే.. గోవా వాతావరణం కూడా సోనియాకు అంతగా పడటం లేదట. ప్రస్తుతం చలికాలం సీజన్. నార్త్ లో అయితే ఎక్కడికి వెళ్లినా ఫుల్లు చలి. అందుకే.. దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడైనా సేఫ్ ప్లేస్ లో కొన్ని రోజుల పాటు ఉండాలని సోనియా అనుకుంటున్నారట.
సౌత్ లో చెన్నైలో చెమట ఎక్కువ. బెంగళూరులో చలి ఎక్కువ. ఇక.. ఏ ప్రాంతం వారికైనా సెట్ అయ్యే వాతావరణం ఉండే సిటీ ఒక్క హైదరాబాద్ మాత్రమే. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయి. అన్ని కనెక్టివిటీలు ఉంటాయి. దేనికీ లోటు ఉండదు. పైగా మెట్రో సిటీ. అందుకే.. హైదరాబాద్ కు తన మకాంను మార్చాలని సోనియా భావిస్తోందట.
కొందరు సన్నిహితులు కూడా హైదరాబాద్ అయితే బెటర్ అని అంటున్నారట. దీంతో సోనియా హైదరాబాద్ లోనే కొన్ని రోజులు ఉండి రెస్ట్ తీసుకోవాలని భావిస్తున్నారట. అయితే.. హైదరాబాద్ లో కొత్త ఇల్లు కట్టుకుంటారా? లేక తాత్కాలికంగా ఎక్కడైనా బస ఏర్పాటు చేసుకుంటారా? అనేది మాత్రం తెలియదు. మొత్తానికి సోనియా అటు తిరిగి.. ఇటు తిరిగి హైదరాబాద్ కే రాబోతున్నారన్నమాట. చూద్దాం మరి సోనియమ్మ ఎప్పుడు హైదరాబాద్ కు విచ్చేస్తారో?