పవన్ పై నోరుపారేసుకున్న సీపీఐ నేతకు వార్నింగ్ ఇచ్చిన బీజేపీ అధ్యక్షుడు.. ? 

 

రాజకీయాల్లో అభిమానులుంటారు కానీ వీర అభిమానులు ఉండటం చాలా అరుదు.. ఈ విషయం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో జరిగిన ఒక రచ్చను చూస్తే అర్ధం అవుతుంది.. ఇక జనసేన పార్టీ పెట్టినప్పటి నుండి ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను కామెంట్స్ చేయని వారుండరు.. వారందరికి తగిన రీతిగా సమాధానాలు అందుతున్నాయి. అది వేరే విషయం కానీ, ఇప్పుడు మనం చదవబోయే విషయంలో మాత్రం.. పవన్ పై చేసిన కామెంట్స్‌కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం ఘాటుగానే స్పందించారు.. ఇంతకి అసలు విషయం తెలుసుకుంటే..

విశాఖలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ నారాయణ, పవన్ ఇలా బీజేపీకి సపోర్టు చేస్తారని ఊహించ లేదని, గత ఎన్నికల్లో బుద్ది తక్కువై పవన్ ని తాము నమ్మి మోసపోయామని దారుణ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.. ఇదే కాకుండా పవన్ వ్యక్తిగత విషయంలోకి కూడా తొంగిచూసిన సీపీఐ నారాయణ.. ప్రధాన మంత్రి మోడీ కాళ్లు పవన్ కళ్యాణ్ పట్టుకుంటున్నారని.. ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకొని మాసికం చేసుకున్నారని అసందర్భంగా వాఖ్యానించారు..

ఇలా వ్యక్తిగత విమర్శలతో దాడికి దిగిన సీపీఐ నారాయణ మాటలకు జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం స్పందించలేదు. కానీ ఆయన మిత్రపక్షం బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం పవన్ పై విమర్శలను తట్టుకోలేకపోయాడు.. అందుకే ఎదురు దాడికి దిగిన సోము వీర్రాజు, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలపై మాట్లాడే నైతిక హక్కు నారాయణకు లేదని.. గత ఎన్నికల్లో పవన్ తో పొత్తు పెట్టుకున్నప్పుడు మీరు మీ జ్ఞాపకశక్తిని కోల్పోయారా అంటూ సంచలన వాఖ్యలు చేశారు.. ఇక దేశంలో అసలు కమ్యూనిస్టులకు ఉనికే లేదని.. అలాంటి పార్టీతో ఎవరు కలవరని స్పష్టం చేయడమే కాకుండా పవన్ కళ్యాణ్ కు, బీజేపీ అండగా నిలుస్తుందని.. పూర్తి మద్దతునిస్తుందని పేర్కొన్నారు.. ఇదే కాకుండా బాబ్రీ మసీదు కేసులో అద్వానీని నిర్ధోషిగా విడుదల చేయడం పై నారాయణ చేసిన విమర్శలను ఖండిస్తూ, ఇలా అవాకులు చెవాకులు పేల్చడం ఆపి కోర్టు తీర్పులను కూడా గౌరవించని మీ లాంటి కమ్యూనిస్టులు రాజకీయాల నుంచి తప్పుకోవాలని హితవు పలికారు సోము వీర్రాజు..