రాజకీయాల్లో శాశ్విత మిత్రులు, శాశ్విత శత్రువులు అంటూ ఎవరు వుండరు, అవసరానికి తగ్గట్లు మారే ఊసరవెల్లులు తప్ప , ఈ మాట అక్షరాలా సత్యం. దేశ రాజకీయాలు విషయం పక్కన పెడితే ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇలాంటి ఊసరవెల్లి రాజకీయాలు బాగానే కనిపిస్తాయి. ప్రశ్నిస్తానంటూ రాజకీయ ప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్ గతంలో టీడీపీ బీజేపీ తో జతకట్టి ఆ తర్వాత తూచ్ అంటూ బయటకు వచ్చాడు.
మళ్ళీ 2019 ఎన్నికల తర్వాత మాకు సరైన జోడి బీజేపీ అంటూ కాషాయం నీడలో తన ప్రయాణం సాగిస్తున్నాడు. అలాంటి నేతపై సిపిఐ నారాయణ తీవ్ర విమర్శలు చేశాడ . పవన్ కళ్యాణ్ మోడీ కాళ్లు పట్టుకుంటున్నారని.. ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకొని మాసికం చేసుకున్నారని సెటైర్లు వేశారు. గత ఎన్నికల్లో బుద్ది తక్కువై పవన్ ని తాము నమ్మామని సీపీఐ నారాయణ ఆడిపోసుకున్నారు. పవన్ ఇలా బీజేపీకి సపోర్టు చేస్తారని ఊహించలేదని నారాయణ ఆరోపించారు. దీనిపై జనసేన నేతల కంటే బీజేపీ నేతలు స్పదించటం విశేషం.
ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలపై మాట్లాడే నైతిక హక్కు నారాయణకు లేదని.. గత ఎన్నికల్లో పవన్ తో పొత్తు పెట్టుకున్నప్పుడు మీరు మీ జ్ఞాపకశక్తిని కోల్పోయారా అని వీర్రాజు ప్రశ్నించారు. రాష్ట్ర అధ్యక్షుడి నుండి పవన్ కళ్యాణ్ కి మద్దతు రావటంతో జనసేన కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మిత్ర దర్మం కొద్దీ బీజేపీ నేతలు పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ ఇచ్చారు తప్ప మరొకటి లేదు. 2019 కి ముందు ఇదే బీజేపీ నేతలు పవన్ కళ్యాణ్ ను ఎన్నెన్ని మాటలు అన్నారో మర్చిపోయారా..? సిపిఐ నారాయణ 2019 పవన్ తో పొత్తు పెట్టుకున్నప్పుడు అతన్ని ఎంతగా పొగిడాడో మర్చిపోయారా..? ఊసరవెల్లి రాజకీయాల్లో ఇవన్నీ సహజమే సుమీ