షాకింగ్ : ఇప్పుడు ఎన్టీఆర్ ని కాంట్రవర్సీలలోకి లాగే కుట్ర..?

Some Plans Being To Drag Jr Ntr Into Controversies | Telugu Rajyam
 
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన సినిమాలు షోలు తో బిజీగా ఉన్నాడు. అలాగే వాటికి స్వల్ప విరామం ఇచ్చి కుటుంబం తో కలిసి వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఇదిలా ఉండగా ఇటీవల ఓ ఘటన విషయంలో ఎన్టీఆర్ స్పందించిన విధానం చాలా చర్చనీయాంశంగా మారింది. అదేంటీ అనేది కూడా అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు అనూహ్యంగా పరిస్థితులు అన్నీ తారక్ ని కావాలని టార్గెట్ చేసే విధంగా మారుస్తున్నట్టు సినీ వర్గాల్లో మరియు రాజకీయాల్లో వినిపిస్తున్న మాట. అందులో భాగంగానే కొందరు టీడీపీ పార్టీ పెద్దలు ఎన్టీఆర్ ని స్వయంగా టార్గెట్ చేస్తూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడ్డం ఒక్కొక్కరికీ షాక్ ఇస్తున్నాయి. 
 
అలాగే ఇంకోపక్క ఎన్టీఆర్ కి ఆప్తులుగా ఉన్న కొందరు రాజకీయ పరంగా వేరుగా ఉండి ఇప్పుడు తమ నాయకుడి కోసం ఎవరినైనా రోడ్డుకి ఈడుస్తాం అనే టైప్ మాటలను మాట్లాడ్డం ఇంకో సంచలనంగా మారింది. దీనితో ఇదంతా చూస్తూ ఉంటే ఎన్టీఆర్ అభిమానులకు సహా ఇతర హీరోల అభిమానులకి కూడా కావాలనే ఎన్టీఆర్ ని కాంట్రవర్సీ లలోకి లాగాలని చూస్తున్న ప్రయత్నంలా అనిపిస్తుంది. అలాగే ఎప్పుడూ లేని విధంగా ఒత్తిడులు ఎన్టీఆర్ పై వచ్చి పడ్డట్టు అవుతున్నాయి. మరి తన స్టాండ్ ఏంటి అనేది చూడాలి.
 

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles