Bheemla nayak : బిగ్ న్యూస్ : “నాయక్” ముందు పాన్ ఇండియా సినిమాలు సైతం తలొగ్గక తప్పలేదు.!

Bheemla nayak : మన టాలీవుడ్ స్టార్ హీరోస్ లో ఎవరి క్రేజ్ వారికి సెపరేట్ గా ఓ రేంజ్ లో ఉంటుంది అని చెప్పాలి. మరి వీరిలో ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులతో పోటీ పడే బిగ్ స్టార్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. సోషల్ మీడియాలో కానీ బాక్సాఫీస్ దగ్గర గాని పవర్ స్టార్ క్రేజ్ వేరే లెవెల్లో ఉంటుంది. అందుకే తన సినిమాలు వచ్చే నాటికి ఒక్కసారిగా పరిస్థితులు మారుతాయి.

అయితే అది డైరెక్ట్ సినిమా అయినా రీమేక్ అయినా పవన్ పేరుతోనే ఆ సినిమాకి అన్నీ నడుస్తాయి. ఇలా చెప్పుకుంటూ వెళితే పవన్ క్రేజ్ తో అప్పట్లో బాహుబలి రికార్డులు కూడా బద్దలైన సందర్భాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు భీమ్లా నాయక్ తో మళ్ళీ పవన్ ప్రభంజనం సృష్టించాడు. తాజాగా రిలీజ్ అయ్యిన ట్రైలర్ తో టాలీవుడ్ లో ఏకంగా పాన్ ఇండియా సినిమాల రికార్డులని కూడా వదలకుండా హంట్ చేస్తున్నాడు.

మన టాలీవుడ్ లో బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా “ట్రిపుల్ ఆర్(RRR)” ట్రైలర్ నే ఇప్పటివరకు అనేక ఫాస్టెస్ట్ రికార్డులను అందుకొని సంచలనం రేపింది. మరి ఇపుడు భీమ్లా నాయక్ ముందు ఆ సినిమా సహా మరిన్ని పాన్ ఇండియా సినిమాలు తలొగ్గక తప్పలేదు.

ట్రిపుల్ ఆర్ కి 24 గంటల్లో 1.24 మిలియన్ లైక్స్ అందుకొని హైయెస్ట్ గా ఆల్ టైం రికార్డు సెట్ చెయ్యగా ఇందులో 1 మిలియన్ లైక్స్ భీమ్లా నాయక్ కేవలం 13 గంటల్లోనే కొట్టేసి టాలీవుడ్ లో ఆల్ టైం ఫాస్టెస్ట్ రికార్డు సెట్ చేసాడు..ఇక ఈ స్పీడ్ లో మిగతాది కూడా సునాయాసం అని కూడా చెప్పాల్సిందే. మొత్తంగా అయితే ఇప్పుడు భీమ్లా నాయక్ హవా యూట్యూబ్ లో నడుస్తుంది.