Balayya’s NBK 107 : NBK 107 – బాలయ్యకి సరైన విలన్ ని దింపిన మేకర్స్..లుక్ అదిరింది.!

Balayya’s NBK 107 : టాలీవుడ్ లో ఉన్నటువంటి మాస్ హీరోస్ లో ఒక సరైన హిట్ పడితే ఎలా ఉంటుందో చూపిస్తారు. మరి ఆ తరహా మాస్ ఇమేజ్ ఉన్న హీరోస్ లో నందమూరి నటసింహ నందమూరి బాలకృష్ణ ఒకరు. ఒక్క మంచి సినిమా పడితే చాలు బాక్సాఫీస్ దగ్గర లాంగ్ రన్ తాను చూసుకుంటాడు.
దానికి ఉదాహరణగా రీసెంట్ గా వచ్చిన అఖండ సినిమాని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యాక మరో హిట్ దర్శకుడు గోపీచంద్ మలినేని తో 107వ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసారు. అయితే ఇది షూటింగ్ మొదటి రోజే బాలయ్య లుక్ రివీల్ అవ్వడంతో వెంటనే ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసి అదరగొట్టారు.
మరి ఈ సినిమాలో తనతో పాటు తనకి సమానంగా ఢీ కొట్టే కొన్ని పాత్రలని మేకర్స్ అనౌన్స్ చేస్తూ వచ్చారు. ఆ పాత్రల్లో కన్నడ నటుడు దునియ విజయ్ కూడా ఒకరు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో అతడు బాలయ్యకి సరైన విలన్ పాత్రలో నటిస్తున్నట్టు అధికారికంగా అనౌన్స్ చేసారు.
చాలా స్టైలిష్ మరియు పవర్ ఫుల్ విలన్ గా తాను కనిపిస్తుండగా అతడు ఈ సినిమాలో ముసలి మడుగు ప్రతాప రెడ్డి అనే పాత్ర చేస్తున్నట్టు తెలిపారు. దీనితో బాలయ్య లుక్ కి సరిపడే విధంగా అదే రీతిలో విలన్ దొరికాడని చెప్పాలి. ఇంకా ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా కీలక పాత్ర చేస్తుండగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే థమన్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు నిర్మాణం వహిస్తున్నారు.
https://twitter.com/MythriOfficial/status/1503948076905496577?s=20&t=sQW-39KnDstkAwWneG1vLA