Sobhita: సినీనటి శోభిత ధూళిపాళ్ల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె అచ్చ తెలుగు అమ్మాయి అని చెప్పాలి తెనాలికి చెందిన ఈమె సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చారు అయితే ఈమె తెలుగు సినిమాల ద్వారా కాకుండా బాలీవుడ్ సినిమాల ద్వారా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు. ఇలా బాలీవుడ్ సినిమాలతో మొదలైన తన ప్రయాణం అనంతరం తెలుగు హాలీవుడ్ సినిమాలలో కూడా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇలా హీరోయిన్గా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్న శోభిత గత ఏడాది డిసెంబర్ 4వ తేదీ నటుడు అక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. నాగచైతన్య సమంతను పెళ్లి చేసుకొని ఆమెకు విడాకులు ఇచ్చిన అనంతరం నటి శోభితను రెండో పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లి తర్వాత శోభిత కేవలం ఇంటికి మాత్రమే పరిమితమైన ఇంకా ఎలాంటి ప్రాజెక్టులను కూడా ఈమె ప్రకటించలేదు.
ఇలా వీరి పెళ్లి జరిగి మూడు నెలలు అవుతుంది అయితే తాజాగా సినిమాల విషయంలో శోభిత ఎవరు ఊహించని నిర్ణయం తీసుకొని అందరికీ గట్టి షాక్ ఇచ్చిందని చెప్పాలి. శోభిత పెళ్లికి ముందు ఫోటోలను కనుక చూస్తే మనం పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ బోల్డ్ ఫోటోషూట్స్ చేశారు. ఈ ఫోటోలలో ఈమెను చూసిన వారందరూ కూడా ముక్కున వేలు వేసుకుంటూ విమర్శలు కురిపిస్తున్నారు.
ఈ క్రమంలోనే పెళ్లి తర్వాత కూడా ఈమె ఒక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. సినిమాలే తన ఫ్యాషన్ గా ఉన్న శోభిత పెళ్లి తర్వాత కూడా సినిమాలలో నటించడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. అయితే సినిమాలలో నటించిన ఎలాంటి రొమాంటిక్ సన్నివేశాలలో నటించకుండా అలాగే గ్లామర్ షో చేయకుండా ఉండాలని నిర్ణయం తీసుకున్నారట. ఇలా సినిమాల విషయంలో శోభిత తీసుకున్న ఈ నిర్ణయం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.