Sobhita: మొదటిసారి నీ ముఖం దర్శనం అవుతుంది సామీ….. చైతన్య పై నటి శోభిత ఇంట్రెస్టింగ్ పోస్ట్!

Sobhita: సినీ నటి శోభిత కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు అలాగే వ్యక్తిగత జీవితంలో కూడా ఈమె చాలా సంతోషంగా గడుపుతున్నారని చెప్పాలి. శోభిత గత ఏడాది డిసెంబర్ 4వ తేదీ నాగచైతన్యను వివాహం చేసుకొని అక్కినేని ఇంటి కోడలుగా అడుగు పెట్టిన విషయం మనకు తెలిసిందే. నాగ చైతన్య సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత శోభితతో పరిచయం ఏర్పడింది అయితే ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు.

ఇక పెళ్లి తర్వాత నాగచైతన్య నటిస్తున్నటువంటి మొదటి చిత్రం తండేల్ విడుదల అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నాగచైతన్య తన భార్య శోభిత గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. శోభిత చాలా తెలివైన అమ్మాయిని తెలుగు చాలా చక్కగా మాట్లాడుతుందని తెలిపారు. ఇక ఫ్యాషన్ రంగంలో తనకు చాలా మంచి టేస్ట్ ఉంది. అందుకే నాకు దుస్తులను కూడా ఆమె సెలెక్ట్ చేస్తుందని ఇక నేను ఏ విషయంలో అయినా కూడా శోభిత సలహా తీసుకొని ఫాలో అవుతూ ఉంటానని తెలిపారు.

ఇలా శోభితతో కలిసి తన జీవితం చాలా సంతోషంగా ముందుకు సాగుతోందంటూ నాగచైతన్య వెల్లడించారు. ఇక ఈ సినిమా నేడు విడుదల అవుతున్న నేపథ్యంలో శోభిత సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ఈ సినిమా మేకింగ్‌ సమయంలో మీరు చాలా ఫోకస్‌, పాజిటివ్‌గా ఉండటం నేను చూశాను. ఈ అద్భుతమైన ప్రేమకథా చిత్రాన్ని అందరితోపాటు నేను కూడా చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఫైనల్లీ గడ్డం షేవ్‌ చేస్తావు. మొదటిసారి నీ ముఖం దర్శనం అవుతుంది సామీ.. అంటూ ఈమె పోస్ట్ చేశారు.

ఇలా శోభిత చేసినటువంటి ఈ పోస్టుపై నాగచైతన్య స్పందిస్తూ థాంక్యూ బుజ్జి తల్లి అంటూ రిప్లై ఇచ్చారు. ఇది శోభితకు నిక్ నేమ్ అని తనని ఇంట్లో కూడా నేను బుజ్జి తల్లి అంటూ పిలుస్తాను అని ఇటీవల నాగచైతన్య వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం నాగచైతన్య గత కొద్దిరోజులుగా పొడువాటి జుట్టు గడ్డం పెంచుకొని కనిపించడంతో తనని స్టైలిష్ లుక్ లో చూడటం కోసం శోభిత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని స్పష్టమవుతుంది.