Pawan Kalyan: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన స్టార్డం మొత్తం పక్కన పెట్టి రాజకీయాలలోకి వెళ్లిన సంగతి మనకు తెలిసినదే. సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్న పవన్ కళ్యాణ్ అనూహ్యంగా రాజకీయాలలోకి వచ్చారు. జనసేన పార్టీని స్థాపించిన ఈయన పార్టీ కోసం దాదాపు పది సంవత్సరాలపాటు ఎంతో కష్టపడ్డారు.
ఇలా రాజకీయాలలో కొనసాగుతున్న నేపథ్యంలో ఎంతో మంది ఎన్నో అవమానాలు చేసిన వెనకడుగు వేయకుండా రాజకీయాలలో విజయం సాధించాలనే దిశగానే పయనం చేశారు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాలలో కూడా సంచలనాలను సృష్టించారు. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో మాత్రమే కాకుండా ఈయనకు జాతీయస్థాయి రాజకీయాలలో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ గురించి తాజాగా నటుడు శివాజీ రాజా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా శివాజీ రాజా మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ పడిన కష్టానికి నేడు ప్రతిఫలం దక్కిందని ఆయన నేడు ఉన్నత స్థాయిలో ఉన్నారని తెలిపారు.
పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్న సమయంలో ఆయన జీవితం ఒక పూల పాన్పులా ఉండేది అయితే రాజకీయాలలోకి వచ్చి పూల పాన్పు నుంచి బురదలోకి పడినట్టు అయింది.అక్కడ తిరిగి తిరిగి ఈ స్థాయికి వచ్చాడు. సినిమాకి కోట్లు తీసుకుంటాడు కానీ అవన్నీ వదిలేసి వెళ్ళాడు. ఒకదాన్ని పట్టుకుంటే వదల్లేదు అతను. ఎవరెన్ని మాటలు అన్నా, ఎవరు ఎన్ని చేసినా అతను వదిలి పెట్టకుండా నేడు రాజకీయాలలో ఈ స్థాయిలో ఉన్నారని శివాజీ రాజా వెల్లడించారు. ప్రస్తుతం పవన్ గురించి ఈయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.