Mahesh Babu: భవిష్యత్తులో సితార పెద్ద హీరోయిన్ అవుతుంది: మహేష్ బాబు

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్ఠాత్మక తెరకెక్కిన చిత్రం సర్కారీ వారి పాట. ఈ సినిమా మే 12వ తేదీ విడుదల కానుంది.ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా మహేష్ బాబు ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాల గురించి వెల్లడిస్తున్నారు. ఈ సందర్భంగా మహేష్ బాబు డైరెక్టర్ పరుశురామ్ ఇద్దరిని సుమ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా సుమ సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలను మహేష్ బాబుని ప్రశ్నించారు.

పెన్నీ సాంగ్‌లో కూతురు సితార పర్‌ఫార్మెన్స్‌ గురించి అడగ్గా.. మహేష్ బాబుని అడగగా ఇది తమన్ ఆలోచన అని తెలియజేశారు. నేను ఈ విషయం గురించి నమ్రత ను అడిగేలోగా తమన్ నమ్రతకు ఈ విషయం గురించి చెప్పేశారు. ఇక సుమా మాట్లాడుతూ సితార సినిమా ఎండ్ టైటిల్స్ లో అయినా కనపడుతుందా అని ప్రశ్నించగా వెంటనే మహేష్ బాబు మేకింగ్ వీడియోలో అనుకున్నాం.. ప్రింట్ యుఎస్ వెళ్ళిపోయింది. అయినా వీటి గురించి అడగకండి ఇప్పటికే సితార నేను సినిమాలో ఎందుకు లేను అంటూ అడుగుతోందనీ మహేష్ బాబు తెలియజేశారు.

ఇక సితార నటన పరంగా ఎంతో అద్భుతంగా చేసిందని తన నటన చూసి ఎంతో గర్వంగా ఉందని, నాకు తెలిసి భవిష్యత్తులో సితార గొప్ప హీరోయిన్ అవుతుంది అంటూ మహేష్ బాబు తన కూతురు గురించి చెప్పుకొచ్చారు.ప్రస్తుతం మహేష్ బాబు సితార గురించి చేస్తున్న ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇకపోతే ఈ సినిమా మే 12వ తేదీ విడుదల కావడంతో ఎంతో మంది మహేష్ అభిమానులు ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.