జీవితాంతం వారికి కృతజ్ఞతతో ఉంటా ఎమోషనల్ పోస్ట్ చేసిన సింగర్ సునీత..!

టాలీవుడ్ ప్రముఖ సింగర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సునీత తన మాటలు, పాటలతో పాటు అందంతో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఎన్నో సంవత్సరాలుగా వందల సంఖ్యలో పాటలు పాడిన సునీత ఇండస్ట్రీలో ఫిమేల్ స్టార్ సింగర్ గా గుర్తింపు పొందింది. ఇలా ప్లే బ్యాక్ సింగర్ గా మాత్రమే కాకుండా ఎంతోమంది హీరోయిన్స్ కి సునీత డబ్బింగ్ చెప్పింది. అంతేకాకుండా బుల్లితెర మీద ప్రసారమవుతున్న ఎన్నో సింగింగ్ షోలలో సునీత జడ్జిగా కూడా వ్యవహరిస్తోంది.

ఇలా సింగర్ గా తనకంటూ మంచి గుర్తింపు ఏర్పరచుకున్న సునీత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో సునీత షేర్ చేసే పోస్ట్ నిమిషాలలో వైరల్ గా మారుతుంది. సునీత సోషల్ మీడియాలో తన అందంతో చేసే రచ్చ అంతా కాదు. సునీత అందంలో హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోదు అని చెప్పటంలో సందేహం లేదు. ఎంతో పద్ధతిగా ట్రెడిషనల్ దుస్తులను ధరిస్తూ అందమైన నవ్వుతూ ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ఎంతోమందిని తన ఫాలోవర్స్ గా మార్చుకుంది. సోషల్ మీడియాలో సునీత అప్పుడప్పుడు తన అభిమానులతో చాట్ చేస్తూ తన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. అయితే ఇటీవల సోషల్ మీడియాలో సునీత షేర్ చేసిన ఒక పోస్ట్ వైరల్ గా మారింది.

ప్రముఖ సంగీత దర్శకులు మణిశర్మ, కోటి, కీరవాణితో కలిసి సునీత దిగిన ఒక ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోని షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యింది. ఈ క్రమంలో.. ఇది నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే క్షణం.. నా సింగింగ్ కెరీర్‌లో నాకు ఎన్నో పాటలు అందించిన లెజెండ్స్‌తో.. ఎల్లప్పుడూ కృతజ్ఞతతో.. అంటూ కొంత ఏమోషనల్ అవుతూ సునీత రాసుకొచింది. వీరి దర్శకత్వంలో సునీత ఎన్నో సూపర్ హిట్ పాటలని పాడింది. ప్రస్తుతం ఈ ముగ్గురు ప్రముఖ సంగీత దర్శకులతో కలిసి సునీత దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.