బాలయ్యతో ఊహించని హీరోయిన్..!

Shruthi Hassan to pair up with Balakrishna

Shruthi Hassan to pair up with Balakrishna

నట సింహం నందమూరి బాలకృష్ణ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ‘అఖండ’ కంప్లీట్ అవ్వగానే మలినేని సినిమా మొదలవుతుందట. అయితే ఈ సినిమాలో కథానాయకిగా ఒకరి పేరు వినిపిస్తోంది. ఆమే శృతి హాసన్. బాలయ్య, శృతి హాసన్ కాంబినేషన్ ఎవ్వరూ ఊహించనిది, ట్రై చేయనిది. ఎందుకంటే ఇద్దరికీ ఏజ్ గ్యాప్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. బాలయ్య సినిమాలకు హీరోయిన్ల సమస్య చాలా కాలం నుంచి ఉన్నదే. ఉన్న సీనియర్ హీరోయిన్లలో అందరితోనూ వర్క్ చేశారు బాలకృష్ణ. మళ్ళీ వాళ్లనే రిపీట్ చేస్తే కొత్తదనం ఉండదు. అలాగని మరీ యంగ్ హీరోయిన్లను తీసుకోలేరు. ఇదే బాలయ్య దర్శకులను కిందా మీదా చేసేస్తుంటుంది.

కానీ గోపీచంద్ మలినేని మాత్రం పెద్దగా వర్రీ అవకుండా శృతి హాసన్ ఉంది కదా అనేస్తున్నారట. శృతి హాసన్ మలినేనికి బాగా కలిసొచ్చిన హీరోయిన్. ఆమెతో చేసిన ‘బలుపు, క్రాక్’ రెండూ బ్లాక్ బస్టర్లయ్యాయి. అందుకే ఆమె ఉంటే తన సినిమా హిట్ అని నమ్ముతున్నారు గోపీచంద్ మలినేని. కాబట్టే బాలయ్య సినిమాలో కూడ ఆమెనే తీసుకోవాలని చూస్తున్నారట. ఇప్పటికే సంప్రదింపులు జరుగుతున్నాయట. మరి ఆన్ స్క్రీన్ మీద బాలయ్య, శృతి హాసన్ నడుమ వయసు వ్యత్యాసాన్ని ఎలా కవర్ చేస్తారో చూడాలి.