‘గబ్బర్ సింగ్’ సినిమాతో దశ తిరిగి, స్టార్ హీరోయిన్ అయిపోయిన శృతిహాసన్‌కి , ఆ తర్వాత ప్రేమ, పెళ్లి అనే కారణాలతో కెరీర్ డల్ అయిపోయిన సంగతి తెలిసిందే. లాంగ్ గ్యాప్ తీసుకుని ఎట్టకేలకు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో మాస్ రాజా రవితేజతో ‘క్రాక్’ సినిమాలో తళుక్కున మెరిసింది. ఆ తర్వాత ‘వకీల్ సాబ్’లోనూ ఛాన్స్ దక్కించుకుంది. ఇక అప్పటి నుండీ శృతి కెరీర్‌కి బ్రేకుల్లేవు.
వరుసగా ఆఫర్లు దక్కించుకుంటోంది. ఈ క్రమంలోనే లేటెస్టుగా బాలయ్య సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ‘ఎన్‌బీకే 107’ (వర్కింగ్ టైటిల్) లో బాలయ్య సరసన హీరోయిన్‌గా శృతి హాసన్ ఎంపికైంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌కి రెడీ అవుతోంది.
ఈ సినిమాలో శృతిహాసన్ క్యారెక్టర్ చాలా కొత్తగా ఉండబోతోందట. గ్లామర్ హీరోయిన్‌గా కాకుండా, పర్ఫామెన్స్‌కి స్కోపున్న పాత్ర అంటున్నారు. ‘క్రాక్’ సినిమాలోనూ శృతిహాసన్ ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపించి మెప్పించింది. అలాగే ఈ సినిమాలోనూ శృతి పాత్రను చాలా డిగ్నిఫైడ్‌గా డిజైన్ చేస్తున్నాడట డైరెక్టర్ గోపీచంద్ మలినేని. మొత్తానికి సెకండ్ ఇన్నింగ్స్‌లో శృతిహాసన్‌కి శృతి హాసన్‌కి బాగానే కలిసొచ్చిందనిపిస్తోంది.