Srihan: సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది మంచి గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా కొనసాగుతున్నారు. ఇలా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి యూట్యూబర్స్ గా గుర్తింపు పొందిన వారిలో సిరి హనుమంత్, శ్రీహాన్ వంటి వారు కూడా ఒకరు. ప్రస్తుతం వీరిద్దరూ కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇక ఇద్దరు కూడా బిగ్ బాస్ కార్యక్రమంలోకి వెళ్లి వచ్చి మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఇక బిగ్ బాస్ తర్వాత సినిమాలలో వెబ్ సిరీస్ లలో నటిస్తూ కెరియర్ పట్ల బిజీ అయ్యారు.
ఇక శ్రీహన్ తాజాగా నటించిన వర్జిన్ బాయ్స్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అయితే తాజాగా ఈ సినిమా నుంచి దం దిగ దం.. సాంగ్ లాంచ్ చేశారు. ఇక ఈ సాంగ్ లాంచ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీహాన్ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.వర్జిన్ బాయ్స్‌లో నటించేందుకు బిగ్‌బాస్ బ్యూటీ సిరి అభ్యంతరం చెప్పలేదా? అని శ్రీహాన్‌కు ప్రశ్న ఎదురైంది.
ఈ ప్రశ్నకు శ్రీహాన్ సమాధానం చెబుతూ సినిమాల విషయంలో మేము ఒకరికి ఒకరు ఎప్పుడు పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుకుంటూ ఉంటామని వెల్లడించారు.ఎన్నడూ ఎలాంటి అభ్యంతరాలు రాలేవు. కాకపోతే ఈ సినిమాలో లిప్‌లాక్ సీన్ షూటింగ్ అయ్యాక సిరి నాతో రెండుమూడుసార్లు మౌత్‌వాష్ చేయించిందని ఈ సందర్భంగా శ్రీహాన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే సిరి శ్రీహాన్ గత కొంతకాలంగా రిలేషన్ లో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇలా వీరిద్దరూ రిలేషన్ లో ఉంటూ ఒక బాబుని దత్తత తీసుకొని మరి పెంచుకుంటున్నారు కానీ ఇప్పటివరకు ఇద్దరు పెళ్లి గురించి ఎలాంటి ప్రకటన తెలియజేయలేదు ఇక ప్రస్తుతం కెరియర్ పరంగా వీరిద్దరు ఎంతో బిజీగా గడుపుతున్నారు.