Home News జానారెడ్డి గెలవాలంటే రేవంత్ రావాల్సిందేనా..? ఆసక్తికరంగా సాగర్ రాజకీయం

జానారెడ్డి గెలవాలంటే రేవంత్ రావాల్సిందేనా..? ఆసక్తికరంగా సాగర్ రాజకీయం

 తెలంగాణలో మరికొద్ది రోజుల్లో నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికలను ప్రధాన పార్టీలన్నీ చాలా సీరియస్ గా తీసుకోని సిద్ధం అవుతున్నాయి. అది తెరాస కు సిట్టింగ్ స్థానమైన కానీ, అక్కడ కాంగ్రెస్ కు కూడా గట్టి బలమే ఉంది. దానికి కారణం కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, నాగార్జున సాగర్ లో జానారెడ్డి కి సొంత బలం ఎక్కువ, గత ఎన్నికల్లో కేవలం 4 శాతం ఓట్ల తేడాతోనే ఓడిపోయాడు.

Jana Reddy

 గతంలో గెలుపు అంచులకు వెళ్లిన జానారెడ్డి, ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని పట్టుదలతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తుంది. ఈ దఫా టీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకత తనకి కలిసొస్తుందని ఆయనన అంచనా.
అదే సమయంలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణ కూడా ఆయన లెక్కలో వేసుకున్నారు. బీజేపీని నిలువరించాలంటే.. ఆ పార్టీ ప్రచార వ్యూహాన్ని సమర్థంగా ఎదుర్కోవాలి. అంటే.. కాంగ్రెస్ తరపున కూడా ప్రచారం జోరందుకోవాలి, దానికి ముఖ్య నాయకులు కలసి రావాలి. ఆపద్ధర్మ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా, పీసీసీ పీఠం కోసం ఎదురు చూస్తున్న కోమటిరెడ్డి వెంకట రెడ్డి జిల్లా కూడా అదే కావడంతో వారిద్దరూ కచ్చితంగా జానారెడ్డి కోసం తరలి వస్తారని అంచనాలున్నాయి.

 అయితే ముఖ్యంగా రేవంత్ రెడ్డి లాంటి నేత జానారెడ్డి తరుపున ప్రచారానికి వస్తే కచ్చితంగా అది ఆయనకు ప్లస్ అవుతుంది. కానీ రేవంత్ రెడ్డి వస్తాడా లేదా అనేది అనుమానమే, ఎందుకంటే పీసీసీ పదవిని హోల్డ్ లో పెట్టటంతో రేవంత్ రెడ్డి కొంచం అసహనంతో ఉన్నట్లు తెలుస్తుంది. పైగా పార్టీలోని సీనియర్ నేతలే తనకు ఆ పదవి రాకుండా అడ్డుకున్నారు అనే భావన కూడా రేవంత్ రెడ్డి మదిలో ఉంది, కాబట్టి ప్రచారానికి ఎంత వరకు వస్తారు అనే మిలియన్ డాలర్లు ప్రశ్న, కాకపోతే మొన్న ఒక టీవీ ఛానల్ లో మాట్లాడుతూ నాకు పీసీసి చీఫ్ కంటే కూడా ప్రచార కమిటీ ఛైర్మన్ పదవి ఇస్తే బాగుంటుందని, పీసీసీ పదవి తీసుకోని అందరిని బుజ్జగించుకుంటూ, కలుపులోని పోవటం కష్టమైన వ్యవహారం, ఎదో ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగిస్తే నా వంతుగా ఒక 50 నియోజకవర్గాల్లో పార్టీ గెలుపు కోసం ప్రచారం చేసుకుంటా, అనేక సమస్యల మీద ప్రజలతో కలిసి పోరాటం చేసుకుంటానని చెప్పాడు. ఆ కోవలో చూస్తే రేవంత్ రెడ్డి ఈ సాగర్ ఉప ఎన్నికల ప్రచారానికి రావాల్సి ఉంటుంది.. మరి రేవంత్ రెడ్డి ఆలోచనలు ఎలా ఉన్నాయో ఏమో

- Advertisement -

Related Posts

మంత్రి బుగ్గన సంచలన ప్రకటన: కర్నూలులో 250 ఎకరాల్లో హైకోర్టు!

కర్నూలులోని జగన్నాథగుట్ట ప్రాంతంలో 250 ఎకరాల్లో రాష్ట్ర హైకోర్టు నిర్మితమవుతుందనీ, జ్యుడీషియల్ క్యాపిటల్ ప్రక్రియ హైకోర్టు నుంచి సానుకూల తీర్పు వచ్చిన తర్వాత ప్రారంభమవుతుందనీ వైసీపీ ముఖ్య నేత, ఏపీ ఆర్థిక మంత్రి...

రెండో వివాహం చేసుకున్న అమెజాన్‌ వ్యవస్థాపకుడి మాజీ భార్య !

ప్రపంచంలోనే అత్యంత సంపన్నురాలు, అమెజాన్‌ ఫౌండర్‌ జెఫ్‌ బెజోస్‌ మాజీ భార్య మెకెంజీ స్కాట్‌ మళ్లీ పెళ్లి చేసుకున్నారు. వాషింగ్టన్‌లోని సీటెల్‌కు చెందిన సైన్స్‌ టీచర్‌ డాన్‌ జీవెట్‌ను ఆమె వివాహమాడారు. ఈ...

సబ్బం సంచలనం: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వెనుక ‘క్విడ్ ప్రో కో’.!

మాజీ ఎంపీ, టీడీపీ నేత సబ్బం హరి.. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు సంబంధించి సంచలన ఆరోపణలు చేశారు. ఈ ప్రైవేటీకరణ వెనుక 'క్విడ్ ప్రో కో' (నీకిది.. నాకది..) వ్యవహారం వుందని...

Latest News