టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న సమంత అనంతరం తమిళ సినిమాలలో నటిస్తూ కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అగ్రతాలుగా వెలుగొందారు.ఇలా దక్షిణాది సిని ఇండస్ట్రీలో అగ్ర తారగా ఓ వెలుగు వెలిగిన సమంత ప్రస్తుతం బాలీవుడ్ అవకాశాలను కూడా అందుకుంటూ ఎంతో బిజీగా ఉన్నారు.కెరియర్ పరంగా ఎంతో మంచి గొప్ప స్థాయిలో ఉన్నటువంటి సమంత వ్యక్తిగత జీవితాన్ని మాత్రం గొప్పగా ఉంచుకోవడంలో విఫలమయ్యారు. ఈ క్రమంలోనే నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత కొన్ని సంవత్సరాలకే అతని నుంచి విడిపోయారు.
ఈ విధంగా చైతన్యత విడాకులకు గల కారణాలు ఏమిటి అనే విషయం తెలియకపోయినా ఈమె చైతన్యతో విడిపోయి ప్రస్తుతం తన ఒంటరి జీవితాన్ని కొనసాగిస్తున్నారు.అయితే సమంత విడాకులు తీసుకున్న తర్వాత కాస్త గ్లామర్ డోస్ కూడా పెంచిందని చెప్పాలి.ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ ఫోటోలు దిగుతూ అభిమానులను సందడి చేస్తున్నారు. ఇలా సమంత గ్లామర్ షో చేయడంతో ఈమెపై కొందరు నెటిజన్లు విమర్శలు కూడా చేశారు.అయితే సమంత వాటి గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు ఇకపోతే ఈమె ఎప్పటికప్పుడు ట్రెండీ వేర్ ధరిస్తూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తుంటారు.
తాజాగా ఈమె బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కాఫీ విత్ కరణ్ టాక్ షోలో పాల్గొన్నారు. అయితే సమంత పాల్గొన్న ఎపిసోడ్ ఇంకా పూర్తి కాకపోయినా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది. ఈ కార్యక్రమానికి ఈమె ముదురు గులాబీ రంగు డ్రెస్ ధరించి వెళ్లారు. ఈ క్రమంలోనే ఈ డ్రెస్సులో పలు ఫోటోలు షూట్ నిర్వహించిన సమంత ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఇలా ట్రెండి వేర్లు ఎంతో బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నటువంటి ఈమె డ్రెస్ గురించి నేటిజన్ లు పెద్ద ఎత్తున ఆరా తీస్తున్నారు.అది ఏ బ్రాండ్ దాని ఖరీదు ఎంత అని తెలుసుకునే పనిలో పడ్డారు.సమంత ఈ షోలో పాల్గొనడం కోసం వేసుకున్న డ్రెస్ ఖరీదు ఏకంగా 45 వేలు అని తెలియడంతో అభిమానులు ఒక్కసారిగా కంగుతిన్నారు.