Vijay Fans Set Fire To Theater : షాకింగ్ : “బీస్ట్” ప్లాప్ అని థియేటర్ తగలబెట్టిన విజయ్ అభిమానులు.!

Vijay Fans Set Fire To Theater

Vijay Fans Set Fire To Theater :  కోలీవుడ్ స్టార్ హీరో అయినటువంటి థలపతి విజయ్ హీరోగా నటించిన తాజా చిత్రం “బీస్ట్” ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా కూడా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యిన సంగతి తెలిసిందే. విజయ్ కెరీర్ లో మరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించారు.

అయితే దర్శకుడు నెల్సన్ నుంచి ఈ సినిమా “డాక్టర్” లాంటి సాలిడ్ హిట్ తర్వాత రావడం పైగా విజయ్ తో కావడంతో అంచనాలు కూడా మంచి పీక్స్ లో నెలకొన్నాయి. అలా ఈ రోజు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యిన ఈ సినిమాకి ఫస్ట్ షో తోనే ఊహించని టాక్ వచ్చింది.

అయితే ఇంకో షాకింగ్ అంశం ఏమిటంటే ఈ సినిమా విజయ్ అభిమానులకే నచ్చ లేదట. దీనితో సోషల్ మీడియాలో బీస్ట్ పై అభిమానుల వీడియోలే కొన్ని వైరల్ అవుతుండగా తమిళనాడులో సినిమా ప్లాప్ అయ్యిందని సినిమా చూస్తుండగానే కొందరు అభిమానులు సినిమా తెరకి నిప్పు అంటించారు.

దీనితో ఆ స్క్రీన్ తగలబడింది. ఇప్పుడు ఈ వీడియో విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఈ ఘటన అందరికీ షాకిచ్చింది. మరి ఈ లెక్కన విజయ్ ఫ్యాన్స్ ఎంత అసహననానికి లోనయ్యారో అర్ధం చేసుకోవాలి. ఒకవేళ కంప్లీట్ గా ఈ సినిమా ప్లాప్ జాబితాలో చేరితే మాత్రం భారీ నష్టాలు తప్పవని చెప్పాలి.