Balayya movie : షాకింగ్ : షూట్ మొదటి రోజే బాలయ్య సినిమా నుంచి ఊహించని లీక్..!

Balayya movie : నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఇప్పుడు మరో మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేనితో ఓ పక్కా మాస్ ఎంటర్టైనర్ ని చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. బాలయ్య కెరీర్ లో 107వ సినిమాగా అందులోని తన లాస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ బొమ్మ “అఖండ” తర్వాత చేస్తున్న సినిమా ఇది కావడంతో బాలయ్య అభిమానులు సహా మాస్ ఆడియెన్స్ లో విపరీతమైన అంచనాలు మళ్ళీ నెలకొన్నాయి.

అయితే ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తారా అని ఎదురు చూస్తూ ఉండగా చిత్ర బృందం నిన్న ఫిబ్రవరి 18 నుంచి స్టార్ట్ చేసేసారు. అయితే ఈ స్టార్ట్ చేసిన మొదటి రోజే చిత్ర యూనిట్ కి ఊహించని షాక్ తగిలింది. ఈ సినిమాలో బాలయ్య లుక్ ఎలా ఉంటుందో టోటల్ గా రివీల్ చేసేస్తూ ఒక ఫోటో షూట్ సమయంలోది బయటకి వచ్చేసి ఓ రేంజ్ లో వైరల్ అయ్యిపోతుంది.

అలాగే ఈ లుక్ లో బాలయ్య ని చూసాక బాలయ్య అభిమానులు అయితే ఇంకో అదిరిపోయే మెన్స్ బ్లాక్ బస్టర్ కొట్టేస్తున్నామని ఫిక్స్ అయ్యిపోయారు. పక్కా మాస్ అండ్ రగ్గుడ్ లుక్ లో ఏదో వార్నింగ్ ఇస్తున్నట్టుగా కనిపిస్తున్న బాలయ్య మళ్ళీ మాస్ పూనకాలు తెప్పించడం గ్యారెంటీ అనిపిస్తున్నాడు.

అయితే షూట్ మొదటి రోజే ఇలా మొత్తం లీక్ అయ్యిపోవడం మాత్రం కాస్త గమనించాల్సిన విషయం.. ఇక ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్నారు.