kgf 2 : “కేజీఎఫ్ 2” డీల్ క్యాన్సిల్ చేసుకున్న డిస్ట్రిబ్యూటర్స్.. మరి రిలీజ్?

kgf 2 : పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న చిత్రాల్లో “బాహుబలి 2” ఎంత హైప్ తో సంచలనం రేపిందో మళ్ళీ అలా ఒక సీక్వెల్ కోసం అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది “కేజీఎఫ్ చాప్టర్ 2” అని చెప్పాలి. అయితే ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా వల్ల వాయిదా పడుతూ ఎట్టకేలకి ఈ ఏప్రిల్ నెలలో ప్రపంచ వ్యాప్తంగా భారీ హైప్ తో రిలీజ్ అవుతుంది.
అయితే ఈ సినిమాకి సంబంధించి ఓవర్సీస్ లో భారీ ధరకి అన్ని భాషల థియేట్రికల్ హక్కులు ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ వారు కొనుగోలు చేశారన్న టాక్ ఇంతకు ముందు వచ్చింది. కానీ అనూహ్యంగా వారు ఆ భారీ డీల్ ని క్యాన్సిల్ చేసుకున్నారట. అయితే దీనికి గల కారణాలు ఏంటో తెలీదు కానీ దాదాపు 100 కోట్ల డీల్ అయితే ఓకే అయ్యి వెనక్కి వెళ్లిపోయిందట.
కానీ ఇప్పుడు ఈ సినిమాని మరో డిస్ట్రిబ్యూషన్ సంస్థలు డీల్ క్లోజ్ చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం రిలీజ్ రెడీగా ఉన్న భారీ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) ని విడుదల చేస్తున్న సరిగమ సినిమాస్ వారు అలాగే సినీ స్థాన్ ఫిలిం కంపెనీ మరియు ఏ ఏ ఫిలిమ్స్ ఇండియా వారు ఓవర్సీస్ అన్ని భాషల్లో ఈ భారీ సినిమాని రిలీజ్ చేస్తున్నారట.
మరి అంతే కాకుండా ఏప్రిల్ 13 నుంచే ఈ సినిమా ప్రీమియర్స్ అక్కడ పడనున్నట్టు ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. ఇక ఈ సినిమాలో యష్ హీరోగా నటించగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించాడు.