Indian Heroines : ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో సోషల్ మీడియా ప్రభావం ఎలా ఉందో తెలిసిందే. దీనితోనే ముఖ్యంగా సినీ ప్రముఖులు అంతా తమ ఫాలోవర్స్ తో టచ్ లో ఉంటారు.
అయితే వీటితో పాటుగా చాలా వరకు లేడీస్ కి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్లే హ్యాక్ అయ్యిన ఉదంతాలు చాలా వరకు విన్నాము.
గత కొన్నాళ్ల కితం స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే సీనియర్ నటులు ఖుష్బూ లాంటి వారు ఈ హ్యాకర్లు బారిన పడ్డారు. మరి లేటెస్ట్ గా అయితే ఊహించని విధంగా వరుస ఉదంతాలు చోటు చేసుకుంటుండడం అది కూడా ఇన్స్టాగ్రామ్ పైనే జరుగుతుండడం సినీ వర్గాల్లో షాకింగ్ గా మారింది.
అయితే మొదటగా ఈ హీరోయిన్స్ లో బాలీవుడ్ ప్రముఖ గ్లామరస్ నటి యామి గౌతమ్ కి మొదట హ్యాకర్లు షాకివ్వగా ఇప్పుడు మరో యంగ్ హీరోజునే హ్యాకర్ల బారిన పడ్డట్టు తెలిసింది.
ఈ సారి హీరోయిన్ మన సౌత్ ఇండియా యంగ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ అట.
ఆమె కూడా తన నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హాక్ అయ్యినట్టుగా గ్రహించానని దాన్ని సాల్వ్ చెయ్యడానికి ఎవరైనా హెల్ప్ చెయ్యండి అంటూ తన ట్విట్టర్ ద్వారా తెలిపింది.
అయితే ఇలా వరుసగా హీరోయిన్స్ అకౌంట్లు హ్యాక్ అవుతుండడం ఎక్కడో కొడుతుంది అని చెప్పాలి. మరి రీసెంట్ గా యామి గౌతమ్ పలు బాలీవుడ్ సినిమాలు చేయగా ఐశ్వర్య రాజేష్ “టక్ జగదీష్” మరియు “రిపబ్లిక్” సినిమాలతో పలకరించింది.
https://twitter.com/aishu_dil/status/1510907384667176965?s=20&t=gURUUDI-RXBddJsur1GZPQ