RRR Movie : షాకింగ్ : “RRR” లో ఆ 40 నిమిషాలకి ఏకంగా 100 కోట్లు..?

RRR Movie : టాలీవుడ్ సినిమాను నుంచి రాబోతున్న పలు ఇంట్రెస్టింగ్ క్రేజీ మల్టీ స్టారర్స్ లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో రాజమౌళి ఎస్ ఎస్ తెరకెక్కించిన చిత్రం ట్రిపుల్ ఆర్(RRR) ముందు వరుసలో ఉంటుంది. దీనిపై ఏ స్థాయి హైప్ ఉందొ కూడా చెప్పడం సాధ్యం కాని పరిస్థితి మునుపటిలా కానీ పరిస్థితులు ఉంటే ఈ సినిమాపై ఉన్న హైప్ కి ఇక నుంచి ఇండియన్ సినిమా దగ్గర నాన్ ట్రిపుల్ ఆర్ అనే స్టాంప్ పడిపోయి ఉండేది.

మరి ఇంతలా హైప్ తెచ్చుకున్న ఈ సినిమాని నిర్మాత దానయ్య డీవీవీ దాదాపు 450 నుంచి 500 కోట్లతో నిర్మాణం వహించారు. మరి కొన్ని రోజులు కితమే ఓ సన్నివేశాన్ని రోజుకి 75 లక్షలు ఖర్చు పెట్టి అలా ఎన్నో రోజులు తీసారని టాక్ వస్తేనే ఏంటో అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏకంగా 100 కోట్లు పెట్టి రాజమౌళి ఈ సినిమాలో ఓ భారీ సీన్ ని తీసారట.

అదే ఈ సినిమాలోని క్లైమాక్స్ సీక్వెన్స్. ఈ సీక్వెన్స్ సినిమాలో దాదాపు 40 నిముషాలు ఉంటుందట. భారీ స్థాయి గ్రాఫిక్స్ మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో ఈ సీన్ నిండిపోయి విజువల్ ధమాకా లా అనిపిస్తుందట. మరి ఈ 40 నిమిషాల కోసం 100 కోట్లు అక్షరాలా 100 కోట్లు ఖర్చు చేశారట. ఇప్పుడు ఈ టాక్ ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో మంచి హాట్ టాపిక్ గా వినిపిస్తుంది.