ఈ ఏడాదిలో మన టాలీవుడ్ నుంచి ఎంత భారీ హిట్స్ పడ్డాయో అదే తరహాలో ఘోరాతి ఘోరమైన డిజాస్టర్స్ కూడా పడ్డాయి. అయితే ఈ డిజాస్టర్ చిత్రాల్లో మాత్రం మెగాస్టార్ చిరంజీవి మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ చిత్రం “ఆచార్య” కూడా ఒకటి. ఈ సినిమా ఊహించని రేంజ్ ఎపిక్ డిజాస్టర్ అయ్యింది.
దాదాపు 70 కోట్లకి పైగానే నష్టాలను మిగిల్చి బయ్యర్లను ముంచేసింది. అయితే ఆ మధ్యలో చరణ్ మరియు చిరులు కలగజేసుకుని ఈ మేటర్ ని కొరటాల సెటిల్ చెయ్యాల్సిందిగా చెప్పినట్టు టాక్ వచ్చింది. దీనితో అప్పటికి మేటర్ క్లోజ్ అయ్యిపోయింది అని అంతా అనుకున్నారు కానీ అసలు విషయం ఇపుడు సినీ వర్గాల్లో బయటకి వచ్చింది.
వాస్తవానికి అయితే ఈ సినిమా కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్స్ కి ఒక్క రూపాయి కూడా తమ నష్టాల నుంచి వెనక్కి తిరిగి రాలేదట. చిరు చరణ్ లు నిజంగానే తప్పుకున్నారో ఏమో కానీ నిర్మాత కూడా ఇప్పుడు అందుబాటులో లేరని అంటున్నారు. దీనితో మళ్ళీ మేటర్ కొరటాల దగ్గరకి వెళ్లేలా ఉందని తెలుస్తుంది. మొత్తానికి అయితే ఆచార్య సస్పెన్స్ ఇప్పుడప్పుడే తేలేలా లేదని అనిపిస్తుంది.