Bangarraju : ఇన్సైడ్ టాక్ : “బంగార్రాజు” రిలీజ్ రోజే షాకింగ్ అప్డేట్.. ఓటిటిలో అప్పుడే రిలీజ్.!

Bangarraju : ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ఏవేవో సినిమాలు రిలీజ్ కావాల్సి ఉండగా మొదటి నుంచి ఫిక్స్ అయ్యిన భారీ సినిమాల్లో చిన్న సినిమాగా ఉన్న సినిమా “బంగార్రాజు” ఒకటి. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ అక్కినేని నాగార్జున మరియు యువ సామ్రాట్ కింగ్ నాగ్ కొడుకు నాగ చైతన్యలు హీరోలుగా నటించిన ఈ చిత్రం ఈరోజు జనవరి 14న రిలీజ్ అయ్యింది.

అయితే సినిమా ఎలా ఉంది గత సోగ్గాడే చిన్ని నాయన మ్యాజిక్ ని రిపీట్ చేసిందా లాంటి అంశాలు పక్కన పెడితే ఈ రిలీజ్ రోజే షాకింగ్ అప్డేట్ ఈ సినిమాపై వినిపిస్తుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులని జీ సంస్థ వారు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ జీ 5 లో ఈ సినిమా ఈరోజు నుంచి కేవలం 15 రోజుల్లో స్ట్రీమింగ్ కి వచ్చేయనున్నట్టు సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.

అయితే ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది. గతంలో కూడా పలు భారీ సినిమాలు ఇంత త్వరగా వచ్చేసిన సందర్భాలు ఉన్నాయి. మరి ఈ సినిమా కూడా అలాగే వస్తుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ గా రమ్య కృష్ణ కృతి శెట్టి లు నటించిన యంగ్ అండ్ హాట్ బ్యూటీ దక్ష నగర్కార్ ఐటెం సాంగ్ చేసింది.