Director Shankar : ట్విస్ట్ – రామ్ చరణ్ సినిమాకి కథ శంకర్ సొంతం కాదట..మరి ఎవరిది.?

Director Shankar : ప్రస్తుతం పాన్ ఇండియన్ సినిమా దగ్గర మంచి క్రేజ్ నెలకొల్పుకున్నా భారీ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు కోలీవుడ్ స్టార్ దర్శకుడు శంకర్ ల కాంబోలో అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ కూడా ఒకటి. అయితే ఇది అనౌన్స్ చేసిన రోజునే భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు రెండు షెడ్యూల్స్ ని కూడా పూర్తి చేసుకొని మూడో షెడ్యూల్ కి రెడీ అవుతుంది.

మరి ఇదిలా ఉండగా మామూలుగానే శంకర్ సినిమాలు అంటే అందరికీ ఒక ఐడియా ఉంది. భారీ స్థాయి బడ్జెట్ విజువల్స్ తో స్ట్రాంగ్ కంటెంట్ తో కూడా శంకర్ కొడతాడు. అయితే తన సినిమాలకి బలమే కథ అని అందరికీ తెలుసు. కానీ తర్వాత తర్వాత తన సినిమాలు అంతగా ఆడకపోవడంతో మళ్ళీ సోషల్ సబ్జెక్టు నే ఎంచుకున్నాడు.

దాదాపు తన సినిమాలకి తానే కథలు రాసుకునే శంకర్ రామ్ చరణ్ తో సినిమాకి మాత్రం అతని కథతో చెయ్యట్లేదు షాకింగ్ ట్విస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. అవును ఈ సినిమాకి కథ శంకర్ ది కాదట. తాను ఇంకొకరి దగ్గర తీసుకొని ఈ సినిమా చేస్తున్నాడని ఆసక్తికర సమాచారం ఇప్పుడు బయటకి వచ్చింది. మరి ఆ కథ అందించింది ఎవరో కాదట.

తమిళ మరో స్టార్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ అట. “పేట”, గద్దల కొండ గణేష్ ముందుగా తమిళ్ లో తానే తీసాడు. అలాగే ఇప్పుడు విక్రమ్ తో “మహాన్” ధనుష్ తో జగమే తందిరం లాంటి సినిమాలు చేసి శంకర్ కి కథను అందించినట్టు తాను చెప్పాడు. అయితే ఇది పక్కా పొలిటికల్ డ్రామాలా ఉంటుందట దానిని శంకర్ మరో స్థాయికి తీసుకెళ్లారని లేటెస్ట్ ఇంటర్వ్యూ లో చెప్పడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారిపోయింది.