Pushpa : షాకింగ్ : లాస్ట్ మినిట్ లో “పుష్ప” కి దెబ్బ!ఇంకా సినిమా రెడీ అవ్వలేదు.!

Pushpa : ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ సహా యూఎస్ మరియు పాన్ ఇండియన్ మార్కెట్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ సినిమా “పుష్ప” పార్ట్ 1. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దేవిశ్రీ ప్రసాద్ మరియు దర్శకుడు సుకుమార్ ల కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది. మరి హ్యాట్రిక్ సినిమాగా ఎంత అంచనాలు ఉన్నాయో పాన్ ఇండియన్ వైడ్ రిలీజ్ అవుతుంది అని మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ భారీ సినిమా సినిమా ఇంకొక్క రోజులో రిలీజ్ కాబోతుంది అనగా ఇండస్ట్రీ వర్గాల నుంచి షాకింగ్ సమాచారం బయటకి వచ్చింది. ఈ టాక్ ప్రకారం అయితే పుష్ప సినిమా ఇంకా రెడీ కాలేదు అట. కొన్ని రోజులు కితమే పుష్ప ఫైనల్ కాపీ ని ఓవర్సీస్ కి ఇచ్చేందుకు సుకుమార్ స్టూడియోలో కష్టపడుతున్నాడని అల్లు అర్జున్ చెప్పాడు.

మరి ఆ ప్రింట్ ఇంకా రెడీ అవ్వలేదట. పైగా అవుట్ ఫుట్ కూడా అనుకున్న రీతిలో రాలేదని తెలుస్తుంది. దీనితో పుష్ప రిలీజ్ కి ముందు షాక్ మీద షాక్ తగిలినట్టు అవుతుంది. అయితే ఈరోజు ఇంకా బాలన్స్ ఉంది కాబట్టి ఈరోజుకి ఈ సమస్యలు ఏవో క్లియర్ అవ్వొచ్చని మాత్రం ఒక టాక్ ఉంది. మరి ఫైనల్ గా ఈ సినిమాకి ఏం జరుగుతుందో అనేది చూడాలి. ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించగా సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.