Bheemla Nayak : షాకింగ్ : “భీమ్లా నాయక్” నుంచీ ఊహించని లీక్..వీరి నుంచి ఏమిటంటే.!

Bheemla Nayak :  గడిచిన రెండేళ్లలో మన టాలీవుడ్ సినిమాల నుంచి ఎన్ని లీకులు బయటకొచ్చాయో తెలిసిందే. ఆల్ మోస్ట్ అందరి స్టార్ హీరోల సినిమాలు నుంచి కూడా ఈ లీకులు బాధ తప్పలేదు. అయితే ఈ లిస్ట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా లేకపోలేదు. తన సినిమాలు అయితే మరీ దారుణం.. “అత్తారింటికి దారేది” అనే సినిమా అయితే మొత్తం ఫుల్ హెచ్ డి లో లీక్ అయ్యి టాలీవుడ్ లో సంచలనం అయ్యిపోయింది.

మరి రీసెంట్ గా “వకీల్ సాబ్” నుంచి కూడా చాలానే లీక్స్ రాగా ఇప్పుడు భీమ్లా నాయక్ బలయ్యాడు. జస్ట్ నిన్ననే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా సర్కారు వారి పాట నుంచి ఓ సాంగ్ అంతా లీక్ అయ్యిందనే వార్త మర్చిపోయే లోపు ఇప్పుడు భీమ్లా నాయక్ నుంచి ఒక ఊహించని లీక్ రావడం మరింత షాకిచ్చింది.

ఇది ఎందుకు ఇంత ప్రత్యేకం అంటే ఈ రోజు చిత్ర యూనిట్ భీమ్లా నాయక్ సాంగ్ షూట్ నుంచి పవన్ స్టిల్ ఒకటి రిలీజ్ చేసారు. ఇప్పుడు అనూహ్యంగా ఇదే వీడియో సాంగ్ బిట్ లీక్ అవ్వడం గమనార్హం. దీనితో ఇది పెద్ద ఎత్తున వైరల్ అయ్యిపోతుంది. ఇంకో ఆశ్చర్యకర విషయం ఏమిటంటే సదరు పవన్ అభిమానులే దీనిని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. థమన్ కి అయితే ఇది దెబ్బ మీద దెబ్బే అని చెప్పాలి.