యశోద సినిమాలో యాక్షన్ సీన్స్ కోసం సమంత ఏం చేసిందో తెలిస్తే షాక్..?

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించే నటిగా తనకంటూ మంచి గుర్తింపు పొందిన సమంత ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోనే టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. తెలుగు తమిళ్ కన్నడ భాషలలో వరుస సినిమాలలో నటిస్తున్న ఈ అమ్మడు బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వటానికి సన్నాహాలు చేస్తుంది. పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించిన సమంత ఆ సినిమా ద్వారా పాన్ ఇండియా లెవెల్ లో మంచి గుర్తింపు పొందింది. దీంతో బాలీవుడ్ లో కూడా సమంతకి మంచి ఆఫర్లు వస్తున్నాయి.

ఇదిలా ఉండగా ప్రస్తుతం తెలుగులో సమంత మూడు సినిమాలతో సమంత బిజిగా ఉంది. సమంత నటించిన శాకుంతలం సినిమా విడుదలకి సిద్దమవుతోంది. ఇక యశోద సినిమా కూడా 90% షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో ఒక పాట మాత్రమే షూటింగ్ చేయవలసి ఉంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న యశోద సినిమా డైరెక్టర్స్ హరి శంకర్, హరీష్ నారాయణ్ సమంత గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఇంటర్వ్యూలో మీరు మాట్లాడుతూ.. ఒక విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఇంత సమయం తీసుకున్న మేము యశోద సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాము. ఈ సినిమా కోసం కమర్షియల్‏గా కాకుండా.. విభిన్న కథానాలను అర్థం చేసుకునే హీరోయిన్ కావాలనుకున్నాము.. అందుకే సమంతను తీసుకోవాలనుకున్నాము. అదృష్టవశాత్తు సమంత కూడా కథ విన్న కొద్ది నిమిషాల్లోనే ఓకే చెప్పారు అంటూ చెప్పుకొచ్చారు.

ఇక ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించే సమయంలో సమంత ఎటువంటి సహాయం తీసుకోవాలని అనుకోలేదు. ఈ సినిమాలోని ప్రధాన యాక్షన్ సీన్స్ ని సెట్ లో షూట్ చేసాము. ఈ యాక్షన్ ఫైట్ సీక్వెన్స్ ల కోసం సమంత 2 , 3 రోజుల పాటు రిహార్సల్ కోసం సమంత అక్కడే ఉందని వెల్లడించారు. ఎందుకంటే సమంత ఎవరి సహాయం లేకుండా తాను స్వయంగా అన్ని యాక్షన్ సన్నివేశాలను చేయాలనుకుంది అంటూ చెప్పుకొచ్చారు. ఈ సినిమా లో ఉన్న అన్ని యాక్షన్, ఫైట్ సన్నివేశాలలో సమంత స్వయంగా చేసిందని వెల్లడించారు. ఈ సినిమాలో హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ యాన్నిక్ బెన్, అలాగే వెంకట్ మాస్టర్లు భారీ యాక్షన్ సన్నివేశాలను రూపొందించారు అంటూ చెప్పుకొచ్చారు.