స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఓ పక్క తన సినిమాలతో పాటుగా ఇతర పలువురు హీరోల్లా కొన్ని టెలివిజన్ ప్రకటనలు కూడా చేస్తాడన్న సంగతి తెలిసిందే. అలా తాను చేసిన ఓ తాజా ప్రకటనే అతడికి ఊహించని షాక్ ఇచ్చింది. రీసెంట్ గా అల్లు అర్జున్ ఒక యాడ్ చేసాడు ‘రాపిడో’ పై.. అయితే ఇందులో బైక్ జర్నీ ని ఉద్దేశించి బస్సు ప్రయాణాన్ని తక్కువ చేసినట్టుగా ఉంటుంది.
అయితే ఇది తెలంగాణా ఆర్టీసీ ప్రతిష్టను దెబ్బ తీసేలా ఉందని అనేక ఫిర్యాదులు వచ్చాయట. దీనితో అల్లు అర్జున్ కి అలాగే రాపిడో యాజమాన్యంకి కూడా ఆర్టీసీ ఎండి సజ్జనార్ నుంచి నోటీసు కూడా వెళ్ళింది. అంతే కాకుండా దీనికి సంబంధించి ఓ నోట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలాంటి ప్రకటనలు చేస్తే అది ఎలాంటి వారు అయినా కూడా ఊరుకునేది లేదు అని కాస్త ఘాటుగానే తెలంగాణా ఆర్టీసీ వారు తమ స్పందనను తెలియజేసారు.