పవన్ స్టామినా ఇంతేనా?షాకింగ్ రెస్పాన్స్ అనుకున్న ‘భీమ్లా నాయక్’.!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు అంటే ఆ హైప్ ఇంకో స్థాయిలో ఉంటుంది. దాని నుంచి వచ్చే ఏ అప్డేట్ అయినా కూడా భారీ రెస్పాన్స్ ను అందుకోవడం ఖాయం. అలానే తన లేటెస్ట్ సినిమా “భీమ్లా నాయక్” నుంచి ప్రతీ అప్డేట్ కూడా మంచి మాసివ్ రెస్పాన్స్ ను అందుకున్నాయి.

అయితే ఇదిలా ఉండగా నిన్న రిలీజ్ చేసిన మెలోడీ సాంగ్ కి మాత్రం భీమ్లా ముందు అప్డేట్స్ తో పోలిస్తే అసలు ఊహించని షాకింగ్ రెస్పాన్స్ వచ్చింది. కనీసం ఈ సాంగ్ 24 గంటల్లో 5 లక్షల లైక్స్ కూడా అందులోకోలేకపోవడం గమనార్హం. ఇంతకు ముందు వరకు పవన్ సినిమాల్లో దేనికి కూడా ఇంత తక్కువ రెస్పాన్స్ వచ్చింది లేదు.

పైగా ఈ సాంగ్ కి బాగా పాజిటివ్ మౌత్ టాక్ కూడా వచ్చిందాయె..దీనితో అసలు పవన్ సినిమాల స్టామినా ఇంతేనా పలువురు పెదవి విరుస్తున్నారు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా త్రివిక్రమ్ కూడా వర్క్ చేస్తున్నాడు. అలానే సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం అందిస్తున్న సంగతి తెలిసిందే.