Anasuya Bharadwaj : బుల్లితెర ఫేమస్ షో జబర్దస్త్ తో ఎంతో పేరు తెచ్చుకున్నా గ్లామరస్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కోసం తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన యాంకరింగ్ తో ఎంతగానో అలరించే అనసూయ ఇప్పుడు “పుష్ప” తదితర భారీ చిత్రాల్లో కూడా నటిస్తుంది.
అయితే ఇప్పుడు ఊహించని విధంగా ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకున్నట్టుగా నిర్ధారణ అయ్యింది. అసలు విషయం లోకి వెళితే అనసూయ తండ్రి అయినటువంటి సుదర్శన్ రావు ఖస్బ కాన్సర్ వ్యాధితో బాధ పడుతూ ఈరోజు హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారట. దీనితో అనసూయ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అయ్యారు. మరి వారి ఆత్మకి శాంతి అందాలని మనమంతా కూడా కోరుకుందాం.