Shocking Incident: ప్రైవేట్ పార్ట్స్ ను ఓ మహిళకి చూపిస్తూ అసహ్యంగా ప్రవర్తించిన కారణంగా పోలీస్ అధికారి సస్పెండ్ అయ్యిన వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది. కాపాడే రక్షక భటులే కామాంధుల్లాగా ప్రవర్తిస్తున్నారు. ఇక మహిళలకి రక్షణ ఎక్కడ ఉంటుంది ఈ పాడు సమాజంలో. ఒక మహిళతో పోలీసు అధికారి ప్రవర్తించిన తీరు నివ్వెరపోయేలా చేసింది. ఏకంగా పోలీసు వ్యవస్తే సిగ్గుతో తల వంచింది. వివరాల్లోకి వెళ్తే..
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. చంద్రశేఖర్ రాత్రి ఇంటికి వెళ్తున్నాడు. యలహంక న్యూ టౌన్ హౌసింగ్ బోర్డు సమీపంలోకి రాగానే హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ కి నేచర్ కాల్ వచ్చింది. దీనితో బైక్ రోడ్డు పక్కన ఆపి యూరినేషన్ చేసాడు. ఈ సమయంలోనే వీధి కుక్కలకి ఆహరం పెట్టేందుకు ఓ మహిళ బయటకి వచ్చింది.
ఈ క్రమంలో ఆమెని చూసిన చంద్రశేఖర్ తన ప్రైవేట్ పార్ట్స్ ని ప్రదర్శిస్తూ.. చాలా నీచంగా, అసభ్యకరంగా ప్రవర్తించాడు. అతని వింత ప్రవర్తనని చూసిన మహిళా ఒక్కసారిగా షాక్ కి గురయ్యింది. వెంటనే అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఆ కానిస్టేబుల్ మహిళపై వాగ్వాదానికి దిగాడు.
జరుగుతున్న ఘటనని స్థానికులు వీడియో తీశారు. ఈ వీడియోని బెంగుళూరు పోలీస్ కమీషనర్ సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసారు. ఐపీసీ సెక్షన్లు 354(A), 509 ల కింద యలహంక న్యూ టౌన్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ చంద్ర శేఖర్ పైన కేసు నమోదు అయ్యింది. ఈ కేసుపైన తదుపరి విచారణ పోలీసులు జరుపుతున్నారు.