Mohan Babu : టాలీవుడ్ సినిమా దగ్గర ఉన్నటువంటి పలు దిగ్గజ కుటుంబాల్లో మన సీనియర్ హీరోలు అందరికీ ఒక కుటుంబం ఉంది. అలాగే డైలాగ్ కింగ్, కలెక్షన్ కింగ్ అయినటువంటి డాక్టర్ మోహన్ బాబు కి వారి మంచు ఫ్యామిలీ ఉంది. ఒకప్పుడు మంచి మంచి సినిమాలతో ఆదరించినా ఇప్పుడు మాత్రం వీరి నుంచి పెద్ద సినిమాలు ఏమీ రావట్లేదు. పైగా టాలీవుడ్ లో ప్రతి ఒక్కరి వ్యవహారం కూడా అందరికీ తెలిసిందే.
మంచు విష్ణు గాని లక్ష్మీ గాని మోహన్ బాబు గాని ఈ ముగ్గురు ముగ్గురే ఎవరికీ తీసిపోరు రకరకాల స్టేట్మెంట్స్ తో హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటారు. మరి లేటెస్ట్ గా మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా జరిపిన తమ వేడుకలో మోహన్ బాబు పలు సంచలన కామెంట్స్ చేయడం ఆసక్తిగా మారింది. తాను ఎంతో మందికి ఎన్నో రకాలుగా ఉపయోగపడ్డాను కానీ నాకు వారి నుంచి సాయం అందలేదు అని వాపోయారు.
అయితే ఇందులో పాలిటిక్స్ ని కూడా లాగారు. దీనితో ఆ రకంగా అయితే మోహన్ బాబుకి ఇలా జరగాల్సిందే అని నెటీజన్స్ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. మోహన్ బాబు నిరధారంగా ఎంతో మందిపై తీవ్ర ఆరోపణలు చేసారని పాత వీడియోలు బయటకి తీసి మరీ చూపిస్తూ అంటున్నారు. అందుకే ఇప్పుడు మోహన్ బాబు తన కర్మ ఫలితం మూలాన ఇలా బాధ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది అని కొందరు అంటున్నారు. మొత్తానికి అయితే ఈ మంచు వారి కోసం ఎప్పుడూ ఏదొక హాట్ టాపిక్ వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఇది అని చెప్పాలి.