RRR : షాకింగ్ : “RRR” కి మాస్ బుకింగ్స్ ఏ రేంజ్ లో జరుగుతున్నాయో తెలుసా.!

RRR : ఆఫ్టర్ బాహుబలి మళ్ళీ ఇండియన్ సినిమా బాక్సాఫీస్ సహా ఓవర్సీస్ లో మళ్ళీ ఆడియెన్స్ ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్న సినిమా ఏదన్నా ఉంది అంటే అదే ట్రిపుల్ ఆర్(RRR) సినిమానే అని చెప్పాలి. అయితే ఇది మేము చెప్తున్నా మాట కాదు రియల్ టైం లో ఆడియెన్స్ ఇస్తున్న రెస్పాన్స్ నే ఇది చెప్పిస్తుంది.
ఇది వరకే ఓవర్సీస్ లో రికార్డు స్థాయి బుకింగ్స్ జరిపి ట్రేడ్ వర్గాలకి షాకిచ్చిన ఈ సినిమా బుకింగ్స్ ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చెయ్యగా అదే రికార్డు లెవెల్ రెస్పాన్స్ ఈ సినిమా బుకింగ్స్ వస్తున్నాయట. అయితే ఇది ఏ లెవెల్లో లో ఉందో తెలిస్తే ఇంకా షాక్ అవుతారు.
ఈ సినిమా బుకింగ్స్ ఓవర్సీస్ మార్కెట్ లో ఓపెన్ చెయ్యగా కేవలం నాలుగు గంటల్లో 2 లక్షల 50 వేల డాలర్స్ మార్క్, అలాగే 10 గంటల్లో హాఫ్ మిలియన్ మార్క్ ని ఈ సినిమా క్రాస్ చేసేసింది. ఇలా కేవలం అంటే కేవలం గంటల వ్యవధిలోనే ఓ ఇండియన్ సినిమాకి ఈ రేంజ్ బుకింగ్స్ జరగడం మొదటి సారి అని ట్రేడ్ పండితులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి అయితే రాజమౌళి, రామారావు, రామ్ చరణ్ ల “RRR” సెన్సేషన్ భయంకరంగా ఉండేలా ఉందని చెప్పాలిసిందే. ఇక ఇప్పుడే ఇలా ఉంటే రిలీజ్ టైం కి ఆ హైప్ ఎలా ఉంటుందో కూడా ఊహించలేని పరిస్థితి. ఇక ఈ సినిమాలో శ్రేయ, అలియాభట్ తదితరులు నటించగా కీరవాణి సంగీతం అందించారు. అలాగే డీవీవీ దానయ్య నిర్మాణం వహించారు.