Avatar 2 : థియేటర్స్ కన్నా ముందే “అవతార్ 2” ట్రైలర్ మొత్తం లీక్?

Avatar 2 : ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఉన్న సినిమా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ భారీ సినిమా “అవతార్ 2”. దర్శకుడు జేమ్స్ క్యామెరూన్ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ విజువల్ వండర్ దాదాపు 13 ఏళ్ల తర్వాత సీక్వెల్ గా వస్తుంది. గత వారమే ఎంతో గ్రాండ్ గా ఒక స్పెషల్ ప్రీమియర్ ద్వారా 3డి 4డి ఎక్స్ లలో ట్రైలర్ ని వేసిన సంగతి అందరికీ తెలిసిందే.
దీనితో ఒక్కసారిగా వరల్డ్ సినిమా దగ్గర యమా క్రేజ్ ని తెచ్చుకున్న ఈ సినిమా ట్రైలర్ నెక్స్ట్ థియేటర్స్ లో ఈ మే 6న మార్వెల్ వారి సినిమా డాక్టర్ స్ట్రేంజ్ మ్యాడ్ నెస్ ఆఫ్ మల్టీవర్స్ తో రిలీజ్ చేస్తున్నట్టు కూడా కన్ఫర్మ్ చేశారు. అయితే ఇటీవల కాలంలో మన టాలీవుడ్ సినిమాలు రిలీజ్ కి ముందు లీక్స్ కోసం విన్నాం కానీ అనూహ్యంగా ఇప్పుడు అవతార్ 2 ట్రైలర్ మొత్తం లీక్ అవ్వడం షాక్ ఇచ్చింది.
ఇంతకీ ఈ ట్రైలర్ ఎందులో వచ్చేసింది అంటే ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ లో. ఇందులో అవతార్ 2 థియేట్రికల్ ప్రింట్ లాంటిది లీక్ అయ్యి తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ విజువల్స్ మాత్రం మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయని చెప్పాలి. సినిమా టైటిల్ “అవతార్ ది వే ఆఫ్ వాటర్” అనే దానికి న్యాయం చేస్తూ..
చూపించిన విజువల్స్ మరో అద్భుతమైన లోకం లోకి తీసుకెళ్లిపోయినట్టు అనిపిస్తున్నాయి. అందులోని జీవులు గాని కొత్త పాత్రలు మరింత ఆసక్తి రేపగా ఇంకా సమయం ఉన్నా కూడా ఇలా లీక్ అవ్వడం అనేది మేకర్స్ షాకింగ్ అనే చెప్పాలి. కాకపోతే ఎంత లీక్ అయినా కూడా థియేటర్స్ లో చూసే అనుభవం వేరే లెవెల్లో ఉంటుంది. మరి దాని కోసం అయితే ఈ మే 6 వరకు ఆగాల్సిందే.