Pawan Kalyan : పవన్ కళ్యాణ్ మత మార్పిడుల్ని ప్రోత్సహిస్తున్నారా.?

Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌కి వీరాభిమానినని చెప్పుకుంటుందామె. తప్పదు, అలా చెప్పుకోవాల్సిందే. లేదంటే, పబ్లిసిటీ రాదు మరి. కానీ, ఇలా పవన్ కళ్యాణ్ అభిమానులమని చెప్పుకునేవాళ్ళే.. సమయం వచ్చినప్పుడు, తమ నిజస్వరూపం బయటపెట్టుకుంటారు, పవన్ కళ్యాణ్ మీద విషం చిమ్ముతుంటారు.

సినీ నటి మాధవీలత ఇందుకు మినహాయింపేమీ కాదు. తాను పవన్ కళ్యాణ్ అభిమానినంటూ గతంలో ప్రచారం చేసుకుంది. ప్రస్తుతం ఆమె బీజేపీ నేత. గత ఎన్నికల్లో ఆమె పోటీ చేసి ఓడిపోయింది కూడా. సరే, రాజకీయాల్లో గెలుపోటములనేవి సర్వసాధారణం.

అసలు విషయమేంటంటే, జనసేన అధినేత.. సినీ నటుడు కూడా అయిన పవన్ కళ్యాణ్ క్రిస్‌మస్ శుభాకాంక్షలు చెబుతూ, అందులో ‘మానవాళి’ అని ప్రస్తావించారు. అయితే, ఏసుక్రీస్తు కొందరివాడు మాత్రమే.. హిందువులకీ ఏసుక్రీస్తుకీ సంబంధం లేదని మాధవీలత స్టేట్‌మెంట్ ఇచ్చేసింది.

పవన్ కళ్యాణ్ ఫేస్‌బుక్ ద్వారా శుభాకాంక్షలు చెప్పిన తీరు మతమార్పిడుల్ని ప్రోత్సహించేలా వుందన్నది మాధవీలత వాదన. నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్నట్టుంది ఈ వ్యవహారం. ఏ మతానికి ఆ మతం.. కొన్ని నమ్మకాలతో వుంటుంది. ఆ నమ్మకాల్ని ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందే.

రాజకీయ నాయకులు, అన్ని మతాలకు చెందిన దేవాలయాలు, ప్రార్థనాలయాలకు వెళుతుంటారు. వారి వారి విశ్వాసాలపట్ల గౌరవం కలిగి వుంటారు. సినీ సెలబ్రిటీలైనా అంతే. ఆ మాత్రం కామన్‌సెన్స్ లేకపోవడం మాధవి లత వ్యక్తిగత సమస్యగానే