Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పాలనపై శేఖర్ కమ్ముల షాకింగ్ కామెంట్స్… ఇది అసలు ఊహించలేదుగా?

Pawan Kalyan: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న డైరెక్టర్ శేఖర్ కమ్ముల త్వరలోనే కుబేర అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా జూన్ 20వ తేదీ విడుదల కానుంది. సినిమా విడుదలకు మరికొన్ని గంటల సమయం ఉన్న నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా దర్శకుడు శేఖర్ కమ్ముల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఈయన పవన్ కళ్యాణ్ గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి.

పవన్ కళ్యాణ్ సినీ నటుడుగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు అయితే ఇటీవల ఈయన ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇలా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ పాలన ఎలా ఉందనే ప్రశ్న పవన్ కళ్యాణ్ కు ఎదురైంది. ఈ ప్రశ్నకు శేఖర్ కమ్ముల సమాధానం చెబుతూ “తాను కుబేర సినిమా పనులలో ఉన్న నేపథ్యంలో గత మూడు సంవత్సరాలుగా రాజకీయాలపై ఏ మాత్రం దృష్టి సారించలేదని తెలిపారు.

పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి మనిషి, ఆయనలో జనాలకు ఎదో చెయ్యాలనే తపన కచ్చితంగా ఉంది. కచ్చితంగా అద్భుతమైన పాలన ఇస్తున్నాడనే అనుకుంటాను. అయితే రాజకీయాలను అనుసరించకపోవడం వల్ల ఆయన పని తీరుని నేను గమనించలేదు. ఇప్పుడు ఖాళీ దొరికింది కాబట్టి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ పాలన ఎలా ఉంది అనే విషయాల గురించి కూడా గమనిస్తాను అంటూ శేఖర్ కమ్ముల చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక శేఖర్ కమ్ముల పవన్ కళ్యాణ్ మద్య ఎంతో మంచి బాండింగ్ ఉందని చెప్పాలి. పవన్ కళ్యాణ్ మొదట్లో రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో ఆయన ఇచ్చిన స్పీచ్ లపై శేఖర్ కమ్ముల ప్రశంసల కురిపించడం అలాగే సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు చేయడం వంటివి కూడా జరిగాయి. ఇలా పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి ఆయన పాలన గురించి శేఖర్ కమ్ముల చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.